Gold Silver Prices | తగ్గిన బంగారం, వెండి ధరలు

24క్యారెట్ల 10 రాముల బంగారం ధర గురువారం రూ. 1,530 తగ్గి రూ. 1,51,420 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10 రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ.1,38,800 వద్ద నిలిచింది. వెండి ధర రూ. 10,000 తగ్గి రూ. 2,55,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | మన ఆర్థికం | Apr 02, 2026, 12:25 pm IST
Read Time: 3 mins
Gold Silver Prices | తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలతో బంగారం, వెండి ధరలు వరుసగా హెచ్చు తగ్గులు నమోదు చేస్తున్నాయి. గురువారం 24క్యారెట్ల 10 రాముల బంగారం ధర రూ. 1,530 తగ్గి రూ. 1,51,420 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10 రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ.1,38,800 వద్ద నిలిచింది. వెండి ధర రూ. 10,000 తగ్గి రూ. 2,55,000వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణమవుతున్నాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారింది.ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు పెరగడం వల్ల, వడ్డీ లేని ఆస్తిగా ఉన్న బంగారంపై పె పెట్టుబడి పెట్టడంలో ఇన్వెస్టర్లు లాభనష్టాల బేరీజు వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మార్పులు బంగారం ధరలు పతనానికి కారణంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే మునుముందు మార్కెట్ పరిస్థితులు మరింత దిగజారితే పసిడి ధర ప్రస్తుత ధర 4,200డాలర్ల నుంచి 3,800 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. మరోవైపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమైతే లేదా డాలర్ ప్రభావం తగ్గితే ధరలు దీర్ఘకాలికంగా బంగారం 6,000డాలర్లకు కూడా చేరవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Parliament Special Session | మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
Jabardasth fame Komarakka | బంగారం దొంగిలింత‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొమురక్క‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి