Inheritance Tax | వారసత్వ పన్ను అంటే ఏమిటి.. మన దేశంలో కూడా ఈ పన్ను ఉందా..?

Inheritance Tax | తాత ముత్తాతల నుంచి గానీ, తల్లిదండ్రుల నుంచి గానీ వచ్చే ఆస్తులపై విధించే పన్నునే వారసత్వ పన్ను (Inheritance Tax) అంటారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ పన్ను అమల్లో ఉంది. కానీ మన దేశంలో మాత్రం ఈ పన్ను లేదు. మన దేశంలో ఈ పన్ను అమలులో లేనప్పటికీ దీనిపై ఈ మధ్య రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముందుముందు మన దేశంలో కూడా ఈ పన్నును అమల్లోకి తెస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వారసత్వ పన్ను అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం..

Inheritance Tax | వారసత్వ పన్ను అంటే ఏమిటి.. మన దేశంలో కూడా ఈ పన్ను ఉందా..?

Inheritance Tax : తాత ముత్తాతల నుంచి గానీ, తల్లిదండ్రుల నుంచి గానీ వచ్చే ఆస్తులపై విధించే పన్నునే వారసత్వ పన్ను (Inheritance Tax) అంటారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ పన్ను అమల్లో ఉంది. కానీ మన దేశంలో మాత్రం ఈ పన్ను లేదు. మన దేశంలో ఈ పన్ను అమలులో లేనప్పటికీ దీనిపై ఈ మధ్య రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముందుముందు మన దేశంలో కూడా ఈ పన్నును అమల్లోకి తెస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వారసత్వ పన్ను అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం..

అగ్రరాజ్యం అమెరికాలో తండ్రి నుంచి కొడుకుకు సంక్రమించే ఆస్తిపై ప్రభుత్వం 55 శాతం పన్ను తీసుకుంటుంది. ఈ వారసత్వ పన్నుపై అమెరికాలో ఫెడరల్ లా అంటూ ఏదీ లేదు. అమెరికాలోని చాలా రాష్ట్రాలు రెండు రకాల ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి వారసత్వ పన్ను కాగా, ఇంకొకటి ఎస్టేట్ ట్యాక్స్. ఈ ఎస్టేట్ ట్యాక్స్ అనేది మరణించిన వ్యక్తి మొత్తం ఆస్తిపై విధించే పన్ను. మరణించిన వ్యక్తి ఆస్తి నుంచి ఒక వ్యక్తికి ఎంతైతే సంక్రిమిస్తుందో దాని మీద ఆ వ్యక్తి చెల్లించే పన్ను వారసత్వ పన్ను.

అయితే ఆస్తి విలువ 10 లక్షల డాలర్లు, అంతకంటే తక్కువ ఉంటే ఈ వారసత్వ పన్ను నుంచి, ఎస్టేట్‌ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆస్తి విలువ 10 లక్షల డాలర్లు దాటితే మాత్రం 1-18 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మృతుని భార్య బతికి ఉంటే కూడా వారసత్వ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

వారసత్వ పన్నుపై భారత్‌లో భయమెందుకు..?

వాస్తవానికి భారతదేశంలో కూడా ఈ వారసత్వ పన్ను ఉండేది. కానీ 1985లో ఈ పన్నుకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తొలగించారు. ఈ చట్టం ప్రకారం సదరు వ్యక్తి మరణంతో ఆ వ్యక్తి పిల్లలు లేదా మనవళ్లకు సంక్రమించే ఆస్తిపై పన్ను విధిస్తారు. 1953 ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ యాక్ట్‌ ప్రకారం.. ఎస్టేట్ డ్యూటీ అనేది వారసత్వ ఆస్తి విలువపై 85 శాతం వరకు ఉండేది. మన దేశంలో చాలావరకు ఆస్తులు వారసత్వంగా సంక్రమించేవే ఉంటాయి. అందుకే ఈ చట్టం పేరు వినగానే దేశ ప్రజలు భయపడుతారు.