Vijay Devarakonda | విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం: స్వల్పంగా దెబ్బతిన్న కారు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

Vijay Devarakonda | విజయ్ దేవరకొండ  కారుకు ప్రమాదం: స్వల్పంగా దెబ్బతిన్న కారు

సినీ నటులు విజయ్ దేవరకొండ ప్రయాణీస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ఆయన ప్రయాణీస్తున్న కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత తన స్నేహితుడి కారులో విజయ్ దేవరకొండ వెళ్లిపోయారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి స్నేహితులతో కలిసి తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ ప్రయాణీస్తున్న కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఉండవల్లి వద్ద బొలేరో వాహనం ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనుకే వస్తున్న విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో విజయ్ ప్రయాణీస్తున్న కారు ఎడమవైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఇటీవలనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాకు ఎంగేజ్ మెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని ప్రచారం సాగుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో ఈ జంట నటించారు. ఈ రెండు సినిమాలు మంచి హిట్ సాధించడంతో ఈ జంట హిట్ పెయిర్గా నిలిచింది.విజయ్ దేవరకొండ ఇటీవలనే కింగ్ డమ్ సినిమాతో హిట్ కొట్టారు.రౌడీ జనార్ధన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

 

 

 

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature