KCR|కేసీఆర్ సినిమాతో ఆ నటి కూతురు సినిమాల్లోకి.. అచ్చం తల్లి మాదిరిగానే ఉందిగా..!
KCR|సినీ పరిశ్రమలో వారసుల రాక కొత్తేమి కాదు. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న పిల్లలు సైతం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సత్య కృష్ణన్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన కూతురిని సినీ పరిశ్రమలోకి తీసుకువస్తుంది. సత్య కృష్ణన్ అనే పేరు చెబితే కొందరు త్వరగా గుర్తు పట్టకపోవచ్చు కాని, ఆమెని ఒక్కసారి చూ

KCR|సినీ పరిశ్రమలో వారసుల రాక కొత్తేమి కాదు. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న పిల్లలు సైతం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సత్య కృష్ణన్(Satya Krishnan) అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన కూతురిని సినీ పరిశ్రమలోకి తీసుకువస్తుంది. సత్య కృష్ణన్ అనే పేరు చెబితే కొందరు త్వరగా గుర్తు పట్టకపోవచ్చు కాని, ఆమెని ఒక్కసారి చూస్తే ఇట్టే ఐడెంటిఫై చేస్తారు దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆనంద్,` బొమ్మరిల్లు`, సామాన్యుడు, రెడీ, దూకుడు,` బాద్ షా`, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు, మెంటల్ కృష్ణ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది.
ఇటీవలే ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోనూ సత్యకృష్ణన్ నటించి అలరిస్తుంది. ఒకప్పుడు ఆమెకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. స్టార్ హీరోల సినిమాలలోను మంచి పాత్రలు పోషించింది. అయితే ఇప్పుడు ఆమెకి అవకాశాలు అంతగా రావడం లేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఈ నేపథ్యంలో సత్యకృష్ణన్ ఆమె కుమార్తెని రంగంలోకి దించుతుంది. ఆమె పేరు అనన్య కృష్ణన్(Ananya Krishnan) కాగా, ఇప్పటికే నటిగా తెరంగేట్రం చేసింది. గ్యాంగ్ స్టర్ గంగరాజు , ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే సినిమాలో కనిపించిన ఈమె హీరోయిన్‌గా ఒక్క చిత్రం కూడా చేయలేదు.
అయితే ఇప్పడు జబర్దస్థ్ కమెడియన్ రాకేష్(Rakesh) హీరోగా నటిస్తోన్న కేసీఆర్ చిత్రంలో అనన్యా హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే తల్లి హీరోయిన్ కాలేకపోయిన కూతురిని మాత్రం హీరోయిన్‌ని చేయాలని పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అనన్య తన తల్లి మాదిరిగానే అందంగా ఉండడంతో ఆమెకి హీరోయిన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అనన్య కృష్ణన్ కి మంచి బ్యాకప్ దొరికింది. మరి ఈ సినిమా ద్వారా అనన్య ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో అనన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి వాటి ద్వారా ఈ అమ్మడు ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటే ఇక తిరుగే ఉండదు అని నెటిజన్స్ అంటున్నారు