Janhvi Kapoor | ఎన్టీఆర్ ‘దేవర’పైనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఆశలు..!
Janhvi Kapoor | అలనాటి అందాల తార ముద్దుల తనయ జాన్వీకపూర్. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ప్రస్తుతం తెలుగులోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో అభిమాన హీరో అయిన ఎన్టీఆర్‌తో కలిసి దేవర మూవీలో నటిస్తున్నది.

Janhvi Kapoor | అలనాటి అందాల తార ముద్దుల తనయ జాన్వీకపూర్. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ప్రస్తుతం తెలుగులోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో అభిమాన హీరో అయిన ఎన్టీఆర్‌తో కలిసి దేవర మూవీలో నటిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానున్నది. పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ విడుదలకు ముందే రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఎంట్రీలోనే రెండు భారీ చిత్రాల్లో నటించనున్నది.
ఓ వైపు తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సమయంలో బాలీవుడ్ చిత్రాలు మాత్రం సక్సెస్‌కాకపోవడంతో తెలుగు సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. జాన్వీ ఇటీవల బాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. కెరీర్‌లో విజయాలు, పరాజయాలు సహజమే. కానీ, జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న సమయంలో ఈ ఫ్లాపులు కామన్ అయినా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో రావడం కొంచెం ఇబ్బందికరంగా అవకాశం ఉన్నది. వాస్తవానికి ఎన్టీఆర్ దేవర మూవీలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకున్నది కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఎంతో కొంత పని వస్తుందని మేకర్స్ బావించారు. ఈ క్రమంలో జాన్వీ వరుస ఫ్లాప్స్ ప్రభావం దేవరపై పడుతుందేమోనని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ హీరోయిన్ వస్తున్న దేవర మూవీ వచ్చే నెల 27న విడుదల కానున్నది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీని ఎలాగైనా మూవీని దసరాకు ముందు తప్పనిసరిగా విడుదల చేయాలని దర్శకుడితోపాటు మేకర్స్ భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూవీని హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ మూవీతో తిరిగి ఫామ్‌లోకి రావాలని జాన్వీ భావిస్తున్నది. మరి ఈ మూవీ జాన్వీకి కలిసి వస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే. దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా శ్రుతి మరాఠే కనిపించనున్నది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే, శ్రీకాంత్, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మతో పలువురు నటీనటులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు.