అట్లీ  సూపర్​హీరో కథ..విలన్​గా అల్లు అర్జున్​.?

అట్లీ  సూపర్​హీరో కథ..విలన్​గా అల్లు అర్జున్​.?... మార్వెల్ సినిమాలకు భారతీయతను జోడించి అట్లీ ఒక సూపర్హీరో కథను అల్లుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • By: Tech    cinema    Jun 25, 2025 10:10 PM IST
అట్లీ  సూపర్​హీరో కథ..విలన్​గా అల్లు అర్జున్​.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు పుష్పాలతో ఏకంగా బాక్సాఫీస్ వద్ద భారీ కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అర్జున్పేరు మార్మోగిపోతోంది. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తదుపరి చిత్రం కోసం తమిళ పాపులర్ డైరెక్టర్ అట్లీతో జతకట్టిన అల్లు అర్జున్ హాలివుడ్ రేంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూనే వస్తున్నారు. ఇంగ్లీష్లో వచ్చే మార్వెల్ సినిమాలకు భారతీయతను జోడించి అట్లీ ఒక సూపర్హీరో కథను అల్లుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారీ బడ్జెట్తో అల్లు అర్జున్ అట్లీ మూవీ..
అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, పుష్ప(Pushpa)చిత్రాల తర్వాత ఆయనకు అంతర్జాతీయంగా కూడా క్రేజ్ పెరగడంతో తన తదుపరి సినిమాలను మరింత గ్రాండ్ గా అందించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లీ(Atlee Kumar) తన కోసం రాసిన కథకు ఇంప్రెస్ అయిన అర్జున్ తన 22వ చిత్రంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళనాట పేరొందిన పెద్ద చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures) దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను కూడా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తోంది.థోర్, ఎక్సటార్షన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్స్వర్త్(Chris Hemsworth), ఇంకా మెగాస్టార్ విల్ స్మిత్(Will Smith)లతో అట్లీ డిస్కషన్స్ స్టార్ట్ చేసినట్లు తెలిసింది. ఈ చర్చల్లో హీర్ అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నారని సినిమావర్గాల్లో గుసగుసలు.

విలన్ అతనే..?
అల్లు అర్జున్–అట్లీ చిత్రాన్ని నభూతొ నభవిష్యతి అన్న చందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ను కుదిపేస్తోంది. తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, అల్లు అర్జునే హీరోగా, విలన్గా రెండు పాత్రల్లోనూ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో అల్లు అభిమానులు పండగ చేసుకోబోతున్నారు. పుష్పలో పండించిన మానరిజమ్స్ విలన్ అర్జున్కు ఆపాదించి, ఈ పాత్రలో ఆయన దుమ్ములేపుతారని అభిమానులు మురిసిపోవడం ఖాయం. ఇది కనుక ఖరారైతే, సోషల్మీడియా బాక్సులు బద్దలవుతాయి.

ఈ చిత్రం కోసం హాలీవుడ్లోనే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు ఫీల్డ్లోకి దిగడం విశేషం. మార్వెల్(Marvel movies) చిత్రాలకు పని చేసిన గొప్ప టెక్నీషియన్లను అట్లీ రంగంలోకి దించబోతున్నారట. ఇప్పటికే దీపికా పదుకొణె(Deepika Padukone) మెయిన్ హీరోయిన్గా ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో కథ కూడా విభిన్నంగా ఉండబోతోందని అన్ని వర్గాలు డిసైడైపోయాయి. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కూడా ఇందులో నటిస్తోందని అనధికారికంగా తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ముంబైలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు అట్లీ ప్రకటించారు. ఇది 90రోజుల భారీ షెడ్యూల్గా అనుకుంటున్నారట. ఇంత పెద్ద షెడ్యూల్లో అర్జున్ ఎప్పుడూ పాల్గొనలేదు. ఇది పూర్తయిన వెంటనే టీమ్ మొత్తం హాలీవుడ్కు షిఫ్ట్ అవుతుందని అట్లీ బృందం తెలిపింది.