Amy Jackson|మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్న అమీ జాక్స‌న్.. పెళ్లైన రెండు నెల‌ల‌కే బేబి బంప్

Amy Jackson|బ్రిటీష్ మోడల్, ఇండియన్ నటి అమీ జాక్సన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ బ్యూటీ తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టించి అల‌రించింది. ఐ, 2.ఓ వంటి చిత్రాలతో అమీ జాక్స‌న్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ధనుష్, రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సిని

  • By: sn    cinema    Nov 01, 2024 8:35 AM IST
Amy Jackson|మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్న అమీ జాక్స‌న్.. పెళ్లైన రెండు నెల‌ల‌కే బేబి బంప్

Amy Jackson|బ్రిటీష్ మోడల్, ఇండియన్ నటి అమీ జాక్సన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ బ్యూటీ తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టించి అల‌రించింది. ఐ, 2.ఓ వంటి చిత్రాలతో అమీ జాక్స‌న్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ధనుష్, రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాలో నటించింది. కానీ అమీకి సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో మధ్యలో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ప్రేమ‌, పెళ్లి, ప్ర‌గ్నెన్సీ వంటి విష‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. వ్యాపారవేత్త జార్జ్ పనయోటుతో అమీ జాక్సన్( Amy Jackson) కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ సమయంలో ఓ బాబుకి జ‌న్మ‌నిచ్చింది.

పెళ్లి కాకుండా అమీ జాక్స‌న్ బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అయింది. ఇక కొన్నాళ్ల‌కి బ్రేక‌ప్ చెప్పి ఎడ్ వెస్ట్‌విక్ ని వివాహ‌మాడింది. ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌విక్ ఓ ఇంగ్లీష్ యాక్టర్. అంతే కాకుండా సంగీతకారుడు కూడా. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరున తాను పెళ్లి చేసుకున్నట్లు అమీ జాక్స‌న్ ప్రకటించారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ఎడ్ వెస్ట్‌విక్‌ (Ed Westwick) తో ఆవిడ ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లయిన రెండు నెలలకు బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు..నటి అమీ ఇప్పటికే తన ఐదేళ్ల కొడుకు ఆండ్రియాస్ పనాయోటౌకు తల్లిగా పోష‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటుంది. ఆమె తన మాజీ భాగస్వామి జార్జ్ పనాయోటౌ నుంచి దూర‌మ‌య్యాక ఆండ్రియాస్ ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది.

ఇప్పుడు ఎడ్ వెస్ట్ విక్ (Ed Westwick)తోను బిడ్డ‌ను కంటోంది. ఈ జంట శుభ‌వార్త చెప్పినందుకు స‌హ‌చ‌రులంతా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఈ‌ ఏడాది జనవరిలో అమీ జాక్సన్, ఎడ్ వెస్ట్‌విక్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఆగస్టులో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే తాను ప్రేమలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2022లో డేటింగ్ మ్యాటర్ బయట పెట్టారు. ‘గాసిప్ గర్ల్’ షో ద్వారా ఎడ్ వెస్ట్‌విక్ పాపులర్ అయ్యారు.