Ananth Ambani|స్టార్ హీరోల‌కి రూ.2 కోట్ల గిఫ్ట్‌లు ఇచ్చిన అనంత్ త‌న చేతికి అంత ఖ‌రీదైన వాచ్‌లు ధరించాడా..!

Ananth Ambani| దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత ఘ‌నంగా నిర్వ‌హించాడో మ‌నం చూశాం. కొడుకు పెళ్లి కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం జూలై 12, శుక్రవారం నాడు అత్యంత వైభవంగా

  • By: sn    cinema    Aug 04, 2024 12:12 PM IST
Ananth Ambani|స్టార్ హీరోల‌కి రూ.2 కోట్ల గిఫ్ట్‌లు ఇచ్చిన అనంత్ త‌న చేతికి అంత ఖ‌రీదైన వాచ్‌లు ధరించాడా..!

Ananth Ambani| దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత ఘ‌నంగా నిర్వ‌హించాడో మ‌నం చూశాం. కొడుకు పెళ్లి కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం జూలై 12, శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కూడా కొన్ని వేడుకలు నిర్వహించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి కోసం ముకేష్ అంబానీ దాదాపు రూ. 5000 కోట్లు ఖర్చు చేశారని,ముకేష్ అంబానీ నికర విలువలో ఇది దాదాపు 0.5 శాతం మాత్ర‌మే అని వార్త‌లు వ‌చ్చాయి.

ఈవెంట్ లో ప్ర‌త్యేకంగా బ్రాండెడ్ వాచీలు వ‌చ్చిన అతిధుల‌కే గిఫ్ట్‌లుగా ఇచ్చాడు. ఆ వాచీల ధ‌ర ఒక్కొక్క‌టి రెండు కోట్ల విలువ ఉంటుందని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వ‌చ్చిన అతిథుల‌కే ఆ రేంజ్ గిఫ్ట్‌లు ఇచ్చాడంటే అనంత్ త‌న చేతికి ఎంత ఖ‌రీదు ఉన్న వాచీలు ధ‌రిస్తాడా అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనంత్ వ‌ద్ద 10 ప‌స్ట్ క్లాస్ ఖరీదైన ల‌గ్జ‌రీ బ్రాండెడ్ వాచ్ లు ఉన్నాయ‌న‌ తెలుస్తోంది. పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చిమ్ అనంత్ వ‌ద్ద ఉన్న‌ట్టు స‌మాచారం. అనంత్ అంబానీకి గ్రాండ్ మాస్టర్ చైమ్‌తో సహా పాటెక్ ఫిలిప్ నుండి 2 లగ్జరీ వాచీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 వాచీలు మాత్రమే ఉత్పత్తి చేయగా,, ఈ వాచ్ చాలా అరుదైన వాచ్‌గా పరిగణిస్తారు.

ఈ వాచ్ ధర దాదాపు రూ.67.5 కోట్లు. పటేక్ ఫిలిప్ తయారు చేసిన రెండవ అత్యంత సంక్లిష్టమైన వాచ్‌గా స్కై మూన్ టూర్‌బిల్లాన్‌ మరో వాచ్.ఈ వాచ్ ధర రూ.54 కోట్లు. రాయల్ ఓక్ వాచ్ కూడా అంబాని ద‌గ్గ‌ర ఉంది. దీని ఖరీదు 1.9 కోట్లు. పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ అనేది పూర్తిగా రూబీ , డైమండ్-పొదిగిన తెల్లని బంగారంతో తయారు చేయబడిన విలాసవంతమైన వాచ్. నాటిలస్ సేకరణలో అత్యంత విలాసవం తమైన ట్రావెల్ వాచ్ ఇది. పూర్తి రూబీ సెట్, డైమండ్ పొదిగిన వాచ్ ధర రూ. 8.2 కోట్లు. నీలమణి క్రిస్టల్‌లోని రిచర్డ్ మిల్లే ఆర్ ఎమ్ 56-01 అత్యంత ఘనమైన, లగ్జరీ స్పోర్ట్స్ వాచీలలో ఒకటి ఇది. రిచర్డ్ మిల్లె నిర్మించిన అత్యంత ఖరీదైన గడియారాలలో ఇది ఒకటి. దీని ధర రూ.25 కోట్లు. ఇలాంటి వాచీలు ఇంకా మ‌రో ఐదు ఉన్నాయి.