ట్విటర్‌లో హనుమాన్ సీక్వెల్ సందడి.. అంజనాద్రి 2.0 షాట్ వీడియో
విధాత : హనుమాన్ సీక్వెల్‌పై డైరక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వెల్‌కమ్ టూ అంజనాద్రి 2.0 పేరుతో ఆయన అంజనాద్రి లోకేషన్‌తో కూడిన వీడియోను విడుదల చేశారు. కొండల మధ్యన నది..ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న అంజనాద్రి వీడియోకు బ్యాక్ డ్రాప్‌లో హనుమాన్ సినిమాలోని రఘునందన పాటను జోడించడంతో వీడియో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. అంజనాద్రి 2.0వీడియో చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజా వీడియోతో డైరక్టర్ హనుమాన్ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అంచనాలను మరింతగా పెంచేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram