ఫేస్‌బుక్‌ ఖాతా పై స్పందించిన‌ అతుల్య రవి

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీల పేర్లపై సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ఖాతాల ద్వారా అసత్య ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల నుంచి పడేందుకు పోలీసులను ఆశ్రయించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారిలో ఇపుడు హీరోయిన్‌ అతుల్య రవి కూడా చేరింది. ఈమె పేరుమీద గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్‌ చేసి.. అందులో అనేక […]

ఫేస్‌బుక్‌ ఖాతా పై స్పందించిన‌ అతుల్య రవి

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీల పేర్లపై సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ఖాతాల ద్వారా అసత్య ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల నుంచి పడేందుకు పోలీసులను ఆశ్రయించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారిలో ఇపుడు హీరోయిన్‌ అతుల్య రవి కూడా చేరింది. ఈమె పేరుమీద గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్‌ చేసి.. అందులో అనేక విషయాలను పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో అతుల్య రవి పేరు ఒక్క సారిగా ప్రచారంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అతుల్య రవి.. వెంటనే స్పందించింది. ‘నా పేరు మీద ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండే ఖాతా నాదికాదు. ఇలాంటి చర్యలు సహించరానివి. మోస పూరితం కూడా. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ఫేస్‌బుక్‌లో ఎలాంటి ఖాతాలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను’.. అంటూ వివరణ ఇచ్చింది.