నువ్వు బీ గ్రేడ్ ఆర్టిస్ట్ వి .. కంగనా రనౌత్
విధాత:బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, తాప్సీ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో ఇద్దరూ విమర్శించుకున్నారు. మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. ఇటీవల టూర్‌కి వెళ్లొచ్చిన తాప్సీ ప్రస్తుతం ‘హసీనా దిల్రుబా’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. తన జీవితంలో కంగనాకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్న వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చారు. తాప్సీ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అని విమర్శించింది. ‘‘నేను వదిలేసిన […]

విధాత:బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, తాప్సీ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో ఇద్దరూ విమర్శించుకున్నారు. మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. ఇటీవల టూర్‌కి వెళ్లొచ్చిన తాప్సీ ప్రస్తుతం ‘హసీనా దిల్రుబా’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. తన జీవితంలో కంగనాకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్న వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చారు.
తాప్సీ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అని విమర్శించింది. ‘‘నేను వదిలేసిన చాలా ప్రాజెక్ట్‌ల్లో తనకి అవకాశం కల్పించమని తాప్సీ నిర్మాతలను బతిమాలుకొని ఈ స్థాయికి చేరింది. ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. కానీ ఇప్పుడు తన జీవితంలో నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు. మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నా. కానీ నా పేరు లేకుండా నీ సినిమా ప్రమోషన్ చేసుకో’ అని కంగన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.