Deepika Padukone | దీపికా పదుకొనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరు. సినీరంగ ప్రవేశం చేసిన దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా తరగతి అందంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా దీపికా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
Deepika Padukone | దీపికా పదుకొనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరు. సినీరంగ ప్రవేశం చేసిన దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా తరగతి అందంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా దీపికా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నది. ప్రతిరోజూ ఉదయం తన దినచర్య వేడినీళ్లతో మొదలవుతుందని చెప్పింది. కెరియర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులుపడ్డానని.. షూటింగ్లో అలసిపోయి క్యాబ్‌లో నిద్రపోయిన రోజులు ఉన్నాయని చెప్పింది. తాను వచ్చే వరకు తన తల్లి టెన్షన్ పడుతూ ఉండేదని దీపిక తెలిపింది.
తానూ చెల్లెలు ఇంట్లో ఏ కష్టం లేకుండా పెరిగామని.. అయితే తల్లిదండ్రులు తమ ఇద్దరిని చాలా సింపుల్‌గా పెంచారని చెప్పింది. తన భర్త రణ్‌బీర్ కపూర్ సైతం సింపుల్‌గానే ఉండేందుకు ఇష్టపడతాడని.. పెద్దగా ఆర్భాటాలకు పోమని.. సాధారణంగా దీపికలాగే ఉంటానని తెలిపింది. తాము సైతం తమ పిల్లలను సింపుల్‌గానే పెంచాలనుకుంటున్నామని తెలిపింది. ఈ సందర్భంగా తన ఫస్ట్ క్రష్ ఎవరో తెలిపింది. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాఫ్రియో అంటే తనకు అభిమానమని.. తన సోదరికి సైతం ఆయనంటే క్రష్ అని దీపికా తెలిపింది. డికాఫ్రియో పోస్టర్లు ఇంట్లో రూమ్ నిండా నింపేసేవారమని తెలిపింది. ఇక టాలీవుడ్లో తనకు నచ్చిన హీరో మహేశ్ బాబు అని దీపిక తెలిపింది. ఇక దీపిక ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నది. పాన్ ఇండియా ప్రభాస్ సరసన ‘కల్కి’ చిత్రంతో పాటు ‘సింగం అగేయిన్’ చిత్రాల్లో నటిస్తున్నది.