Vishwambhara Teaser | విజయదశమి వేళ.. ‘విశ్వంభర’ టీజర్ – సంక్రాంతికే విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా రేపు ఉదయం విడుదల కానుంది.

Vishwambhara Teaser | విజయదశమి వేళ.. ‘విశ్వంభర’ టీజర్ – సంక్రాంతికే విడుదల

యువ దర్శకుడు మల్లిడి వశిష్ట)Vasista Mallidi), మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర(Vishwambhara). దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా కంప్లీట్ చేసుకుంటోంది. సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉండటంతో దర్శకుడు పూర్తిగా దాని మీదే ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani) బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.

కాగా, రేపు విజయదశమి(Dasara) పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వంభర టీజర్(Teaser)ను ఉదయం 10.49 ని.లకు విడుదల చేయనున్నట్లు యువీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని, మెగాస్టార్ చికున్గన్యా పాలవడంతో సంక్రాంతికి విడుదల అవడం అసాధ్యమని సోషల్ మీడియా కోడై కూసినా, వాటన్నింటికీ చెక్ పెడుతూ సంక్రాంతికి వస్తున్నామని చిత్రబృందం అధికారికంగా కుండ బద్దలు కొట్టింది.