Chandrakanth| చంద్ర‌కాంత్ ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణం ఏంటి.. ఆయ‌న భార్య, తల్లి ఏమ‌న్నారంటే..!

Chandrakanth| బుల్లితెర న‌టులు ఇటీవ‌ల ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ లో నటించిన చంద్ర‌కాంత్ త‌న నివాసంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు

  • By: sn    cinema    May 18, 2024 1:51 PM IST
Chandrakanth| చంద్ర‌కాంత్ ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణం ఏంటి.. ఆయ‌న భార్య, తల్లి ఏమ‌న్నారంటే..!

Chandrakanth| బుల్లితెర న‌టులు ఇటీవ‌ల ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ లో నటించిన చంద్ర‌కాంత్ త‌న నివాసంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూయ‌గా, ఆమె మృతిని జీర్ణించుకోలేని చంద్ర‌కాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న మృతి ఇండ‌స్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరేళ్లుగా చంద్రకాంత్ టివి నటి పవిత్ర జయరామ్ తో లివింగ్ రిలేషన్ లో ఉండ‌గా, వారిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. కాని ప‌విత్ర ఇటీవ‌ల జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే కన్నుముసింది. ఇక అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు.

ప‌విత్ర చ‌నిపోయిన‌ప్ప‌టి నుండి చంద్రకాంత్ డిప్రేషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని చంద్రకాంత్ జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర‌ తనను పిలుస్తుంది.. రెండు రోజుల్లో వచ్చేస్తా అంటూ ఎమోషనల్ గా కూడా పోస్ట్‌లు పెట్టాడు. అయితే ఆయ‌న‌కి చాలా మంది ధైర్యం అందించిన కూడా ఆ బాధ‌ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే చంద్ర‌కాంత్ 2015లో శిల్పా అనే యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరిద్ద‌రు బాగానే ఉన్నా ప‌విత్ర ప‌రిచ‌యం అయ్యాక శిల్పాని ప‌క్క‌న పెట్టాడు. అయితే చందు నా వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప‌విత్ర‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టి నుండి న‌న్ను పిల్ల‌ల‌ని ప‌ట్టించుకోలేదు. నాతో ఐదేళ్ల నుండి మాట్లాడ‌డం లేదు.

పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు చంద్ర‌కాంత్ . కానీ పవిత్ర కు చందు కాకుండ వేరే వారితో చాలా రిలేషన్స్ పెట్టుకుంది. ఆమె మాయ‌లో ప‌డి ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వ‌చ్చి తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకుంది శిల్పా. ఇక చంద్ర‌కాంత్ తల్లి మాట్లాడుతూ..నా కొడుకు జీవితాన్ని ప‌విత్ర‌నే నాశనం చేసింది . 5 సంవత్సరాల నుంచి నా కొడలిని కలుసుకోకుండా చేసింది. . మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, నాతోనే ఉంటాడని పవిత్ర చెప్పింది. కారు యాక్సిడెంట్ అయ్యిందని, పవిత్ర చనిపోయిందని ఫొన్ లో చెప్పాడు. వాడు చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు” అంటూ రోదిస్తూ చెప్పింది చందు తల్లి.