Chiranjeevi|చిరంజీవి బర్త్ డే స్పెషల్.. మెగాస్టార్‌కి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఆయనకి ఎన్ని కార్స్ ఉన్నాయి..!
Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెరపై చిరంజీవి కనిపిస్తే పేపర్లు, పూలు ఎగరేసి సంతోషపడే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. తన్నులు తిని మరీ చిరంజీవి టిక్కెట్ కోసం పోటీ పడ్డ అభిమానులు ఎంతమందో. చిరంజీవిని ఇన్సిపిరేషన్‌గా తీసుకొని సినిమాలలోకి వచ్చిన చాలా మంది స్టార్స్ కూడా చిరు సినిమాని థియేటర్స్‌లో చూసేం

Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెరపై చిరంజీవి కనిపిస్తే పేపర్లు, పూలు ఎగరేసి సంతోషపడే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. తన్నులు తిని మరీ చిరంజీవి టిక్కెట్ కోసం పోటీ పడ్డ అభిమానులు ఎంతమందో. చిరంజీవిని ఇన్సిపిరేషన్‌గా తీసుకొని సినిమాలలోకి వచ్చిన చాలా మంది స్టార్స్ కూడా చిరు సినిమాని థియేటర్స్‌లో చూసేందుకు ఎన్నో బాధలు పడ్డారు. అవి పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు కూడా. అయితే కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన మహారాజు చిరంజీవి నిరూపించాడు. ప్రాణం ఖరీదు నుండి పద్మ విభూషణ్ వరకు ఆయన ప్రస్థానం సాగింది. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బ్రేక్ డాన్స్ పరిచయం చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు.
కమర్షియల్ సినిమాలతో థియేటర్లకు ఊపు తెచ్చిన హీరో చిరంజీవి కాగా, ఆయన ఇండియన్ తెరపై బ్రేక్ డ్యాన్స్ లతో కుర్రాళ్లను ఊగిసలాడించారు. కమర్షియల్ సినిమాలతో థియేటర్లకు ఊపు తెచ్చిన చిరంజీవి ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ కోటి రూపాయలు దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని ఓ ఆంగ్ల మీడియా కవర్ పేజ్ పై చిరంజీవి ఫోటో విడుదల చేయడంతో మెగా అభిమానుల ఆనందం అంతా ఇంతాకాదు. ఇక తనకు ఈ వైభవం అభిమానులు, ప్రేక్షకుల వలనే అని భావించిన చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకు ఏర్పాటు చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టాప్ స్టార్స్ గా దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న ఏకైక సీనియర్ హీరో చిరంజీవి మాత్రమే. ఆయన సినిమాకు రూ. 45 కోట్లు తీసుకుంటున్నారు. చిరంజీవి దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో అని తెలుస్తుండగా, ఆయనకు విలాసవంతమైన భవనాలు. లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌసులు, వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవికి ఓ లగ్జరీ హౌస్ ఉంది. ఈ భవనం అధునాతన సౌకర్యాలతో చాలా విలాసవంతంగా ఉంటుంది. ఈ భవనం విలువ 50 కోట్ల రూపాయలకి పైగానే ఉంటుంది. దాని విలువ రూ.30 కోట్లు ఉంటుందని టాక్. ఇక చిరంజీవికి బెంగళూరులో ఫార్మ్ హౌస్ ఉంది. చెన్నైలో ఇళ్ళు ఉన్నాయి. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ కూడా చిరు కొనుగోలు చేశారు. చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ రెండు వేల కోట్లు రూపాయలు ఉంటుందని టాక్. ఇక ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కాగా, ఆయన 69వ పడిలోకి అడుగుపెట్టారు.