Deepika Padukone | ఆన్‌లైన్‌లో వేలానికి ప్రభాస్ హీరోయిన్ గౌన్..! ఎంతకు అమ్ముడుపోయిందంటే..?
Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొని గొప్ప మనసును చాటుకున్నది. ఇటీవల బ్యూటీ బ్రాండ్ 82°E ఈవెంట్‌లో పాల్గొన్నది. పసుపు రంగు మెటర్నిటీ గౌను ధరించి ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది.

Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొని గొప్ప మనసును చాటుకున్నది. ఇటీవల బ్యూటీ బ్రాండ్ 82°E ఈవెంట్‌లో పాల్గొన్నది. పసుపు రంగు మెటర్నిటీ గౌను ధరించి ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది. అయితే, ఈ గౌన్‌ను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టగా.. కేవలం 20 నిమిషాల్లోనే వేలంపాట పాడి దక్కించుకున్నారు. ఈ గౌన్ కోసం చాలామంది పోటీపడ్డట్లుగా తెలుస్తున్నది. దీపికా పదుకునే ఈ గౌనును నైనిక అనే డిజైనర్ ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం. ఈ గౌన్‌ను దీపికా పదుకొనే ఎంతో ఇష్టంతో దగ్గరుండి మరీ డిజైన్ చేయించాటర.
దీపికా తన ఇన్ స్టా వేదికగా పసుపు రంగు గౌను వేలానికి పెట్టినట్లు స్వయంగా చెప్పింది. కేవలం 20 నిముషాల్లోనే దీన్ని రూ. 34వేలకు వేలంపాటలో అమ్ముడుపోయిందని తెలిపారు. దాంతో వచ్చిన ఆదాయాన్ని ఒక మంచి పనికి ఉపయోగిస్తున్నట్లు తెలిపింది దీపిక. కేవలం.. 20 నిమిషాల్లోనే గౌను అమ్ముడుపోయిందని ఆమె బృందం పేర్కొంది. ఇక దీని ద్వారా వచ్చిన డబ్బులను ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు చారిటీ కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. దీపిక పసుపు రంగు గౌనులో ఉన్న చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పసుపు రంగు గౌను బాగుందంటూ బాలీవుట్ నటీ నటులు ప్రశసించారు.
దీపికాపై ఆమె ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దీపికా పదుకొనే రెండు చిత్రాల్లో నటిస్తున్నది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నది. పాన్ వరల్డ్ స్థాయిలో ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హసన్, దిశా పటానీతో పాటు పలువురు నటీనటులు కీలకపాత్రలో చేయనున్నారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్నది. అదే సమయంలో బాలీవుడ్‌లో ‘సింగమ్ అగైన్’ మూవీలో నటిస్తున్నది.