Double iSmart |డబుల్ ఇస్మార్ట్ సినిమాని థియేటర్లో చూడడం మిస్ అయ్యారా.. అయితే టీవీలో చూడండి..!
రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాతో పూరీ కూడా పుంజుకున్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ (Double ismart Shankar)

రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాతో పూరీ కూడా పుంజుకున్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ (Double ismart Shankar)చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు పూరీ.ఇందులో సంజయ్ దత్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాజయం చవి చూసింది.అసలు పూరీ జగన్నాథ్ మేకింగ్ స్టైల్ ఎక్కడికి వెళ్లిపోయిందని మాట్లాడుకోని ప్రేక్షకుడు లేడు. పోకిరి, ఇడియట్, శివమణి, బుజ్జిగాడు, బిజినెస్ మ్యాన్ అసలు 90s, 20s కిడ్స్‌కు పూరీ సినిమాల గురించి చెప్పమంటే కథలు, కథలుగా చెబుతారు.
కాని ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశాక ఆ సినిమాలు తీసింది ఈయనేనా అన్నారు. లైగర్‌తో భారీ దెబ్బ తిన్న పూరీ(Puri Jagannath)… ఇస్మార్ట్ శంకర్‌తో కూడా అదే రిజల్ట్ ఫేస్ చేశాడు. ఈ రెండు సినిమాలు చూసిన చాలా మంది అసలు పూరి సినిమాలు మానేయడమే బెటర్ అని పలువురు నెటీజన్లు కూడా కామెంట్ చేశారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్స్ లో ఏ మాత్రం ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు టీవీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
టెలివిజన్ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ యాక్షన్ డ్రామా అక్టోబర్ 27న (ఆదివారం) జీ తెలుగు సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానుంది. మరి టీవీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుందో చూడాల్సి ఉంది.. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) విలన్‌గా నటించగా.. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కించింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీనే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది., ఓటీటీలోనూ డబుల్ ఇస్మార్ట్ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.