ప్రతి భారతీయుడు లోకల్ .. హీరో సుమన్

విధాత:భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే అంటున్నారు సీనియర్‌ హీరో సుమన్‌. ‘మా’ అసోసియేషన్‌ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న చర్చల గురించి ఓ వీడియో ద్వారా ఆయన స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఎవరికీ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే లెక్కలు ఉండవు. ఆర్టిస్ట్‌ అయిన ప్రతి ఒక్కరూ ఒకే భాషలో సక్సెస్‌ అవుతారని చెప్పలేం. నాలుగు భాషల్లో ప్రయత్నిస్తే ఒక చోట సక్సెస్‌ కావచ్చు. మనకు వైద్యం చేసే డాక్టర్‌ విషయంలో కూడా నాన్‌ […]

ప్రతి భారతీయుడు లోకల్ .. హీరో సుమన్

విధాత:భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే అంటున్నారు సీనియర్‌ హీరో సుమన్‌. ‘మా’ అసోసియేషన్‌ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న చర్చల గురించి ఓ వీడియో ద్వారా ఆయన స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఎవరికీ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే లెక్కలు ఉండవు. ఆర్టిస్ట్‌ అయిన ప్రతి ఒక్కరూ ఒకే భాషలో సక్సెస్‌ అవుతారని చెప్పలేం. నాలుగు భాషల్లో ప్రయత్నిస్తే ఒక చోట సక్సెస్‌ కావచ్చు.

మనకు వైద్యం చేసే డాక్టర్‌ విషయంలో కూడా నాన్‌ లోకల్‌ అని వైద్యం చేయించుకోవడం మానేస్తామా? అలా జరగదు కదా? ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకోవడం అవసరం. అలాగే ఉన్న విద్య కోసం మన బిడ్డల్ని ఇతర రాష్ట్రాల్లో చదివించుకుంటున్నాం. అక్కడ కూడా ఇలాంటి ఫీలింగ్‌ లేవనెత్తితే ఎలా ఉంటుంది’’ అని సుమన్‌ ప్రశ్నించారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌ దక్షిణాదికి చెందిన అమ్మాయి. అక్కడ ఆమెను గెలిపించలేదా? భారతదేశంలో పుట్టనివారు మాత్రమే నాన్‌ లోకల్‌ అవుతారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడం వెనక 25 ఏళ్ల కష్టం ఉంది. ఇప్పుడంతా సాఫీగా నడుస్తోంది. ఇలాంటి సమయంలో సమస్యలను కొని తెచ్చుకోవడం కరెక్ట్‌ కాదు’’ అని సుమన్‌ అన్నారు.

ReadMore:నాగబాబు ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు..కోట శ్రీనివాసరావు