Heroine| 35 శాతం మాత్ర‌మే బతికే ఛాన్స్ ఉంటుంద‌ని ఆ హీరోయిన్‌కి చెప్పార‌ట‌..!

Heroine| సోనాలి బింద్రే .. ఈ అందాల ముద్దుగుమ్మ ఈ త‌రం వాళ్ల‌కి పెద్దగా తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఒక‌ప్పుడు మాత్రం త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించింది అల‌రించింది.

  • By: sn    cinema    Jul 07, 2024 3:42 PM IST
Heroine| 35 శాతం మాత్ర‌మే బతికే ఛాన్స్ ఉంటుంద‌ని ఆ హీరోయిన్‌కి చెప్పార‌ట‌..!

Heroine| సోనాలి బింద్రే .. ఈ అందాల ముద్దుగుమ్మ ఈ త‌రం వాళ్ల‌కి పెద్దగా తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఒక‌ప్పుడు మాత్రం త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించింది అల‌రించింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది . అయితే ఈ భామ త‌న కెరీర్‌లో ఎన్నో విమ‌ర్శ‌లు, అవ‌మానాలు ఎదుర్కొంది. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన సోనాలి .. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌డు చాలా స‌న్న‌గా ఉండేదాన్ని అని చెప్పింది. అప్పుడు నిర్మాత‌లు న‌న్ను బాడీ షేమింగ్ చేసేవాళ్లు. నాపై జోకులు కూడా వేసుకునేవారని వాపోయింది..

ఆ రోజుల్లో హీరోయిన్స్ అంతా లావుగా ఉండేవారు కాబ‌ట్టి, నన్ను అలా కావ‌ల‌ని చెబితే అస్స‌లు ప‌ట్టించుకోలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను అభిమానులు అద‌రించారు. స్టార్ హీరోయిన్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సోనాలి జీవితం స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో ఆమెని క్యాన్స‌ర్ క‌బ‌ళించింది. ట్రీట్‌మెంట్ కోసం ఫారెన్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్స్ ఆమె స‌ర్వైవ‌ల్ రేట్ 35 శాతం మాత్ర‌మే అని చెప్పార‌ట‌. కాని సోనాలి పోరాట ప‌టిమ‌తో ఆమె క్యాన్స‌ర్‌ని జ‌యించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఒక‌వైపు వెబ్ సిరీస్‌లు, మరోవైపు ప‌లు టీవీ షోల‌కి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ సంద‌డి చేస్తుంది.

2018లో సోనాలి క్యాన్స‌ర్ బారిన ప‌డింది. ఓ రియాలిటీ షో చేస్తున్న సమయంలో అనారోగ్యం బారిన పడ‌డంతో జ‌నరల్ చెకప్ కోసమని డాక్టర్ దగ్గరకు వెళితే ఆయ‌న ప‌లు టెస్ట్‌లు చేయించి క్యాన్స‌ర్ వ‌చ్చిందని చెప్పారంటూ సోనాలి పేర్కొంది. అయితే అప్పటికే క్యాన్సర్ చివరి దశ స్టేజ్-4లో ఉన్నట్లు తెలిపారు. బతికే అవకాశం కష్టమని.. కేవలం 30 శాతం ఛాన్స్ మాత్రమే మిగిలి ఉందని చెప్ప‌డంతో నా భ‌ర్త కోపంతో డాక్ట‌ర్‌ని తిట్టారు. అయితే క్యాన్స‌ర్ త‌ర్వాత కీమో థెర‌పీ చేయించుకుంటూ అన్నింటికి దూరంగా ఉంటూ మ‌ళ్లీ కోలుకుంది.