Heroine|ఆ హీరోయిన్ బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఖరీదైన నౌక…ఐ ఫోన్‌లు కూడా..!
Heroine| బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు హీరోయిన్‌గా, ఐటం డ్యాన్సర్‌గా కూడా అలరించింది. అయితే ఈ అమ్మడు ఆగస్ట్ 11న తన బర్త్ డే జరుపుకుంది. ఈ క్రమంలో ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ లగ్జరీ నౌకను కానుకగా బహుమతిగా ఇవ్వబోతున్నాడట. అలాగే ఆమె అభిమానులకు 100 ఐఫోన్ల ను బహుమతులుగా పంపాడట. ఈ మేరకు అతడు జాక్వెలిన్‌కు ఓ లేఖ కూడా రాశాడు. అం

Heroine| బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు హీరోయిన్‌గా, ఐటం డ్యాన్సర్‌గా కూడా అలరించింది. అయితే ఈ అమ్మడు ఆగస్ట్ 11న తన బర్త్ డే జరుపుకుంది. ఈ క్రమంలో ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ లగ్జరీ నౌకను కానుకగా బహుమతిగా ఇవ్వబోతున్నాడట. అలాగే ఆమె అభిమానులకు 100 ఐఫోన్ల ను బహుమతులుగా పంపాడట. ఈ మేరకు అతడు జాక్వెలిన్‌కు ఓ లేఖ కూడా రాశాడు. అందులో ‘మై బేబీ గర్ల్, మై బొమ్మ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. లేడీ జాక్వెలిన్(నౌక పేరు)ను నీకు పంపుతున్నా. ఆగస్ట్ నెలలోనే అది నీకు అందుతుంది. చట్టబద్ధంగా అన్ని పన్నులు చెల్లించాను. వచ్చే ఏడాది బర్త్‌డే వేడుక ఇద్దరం కలిసి చేసుకుందాం’ అంటూ తను రాసిన లేఖలో పేర్కొన్నాడు.
ప్రతి ఏడాదీ అందరి వయసు పెరుగుతుంటే… జాక్వెలిన్ చిన్నది (రివర్స్ ఏజింగ్ అనాలేమో) అవుతుందని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ప్రయివేట్ జెట్ / యాట్చ్, డైమండ్స్ / బికినీలు ఆమెకు సంతోషాన్ని ఇవ్వవని, అందుకోసమే వాయనాడ్ బాధితులకు కూడా సాయం చేస్తున్నానని సుఖేష్ తెలిపారు. సహాయక చర్యలకు రూ. 15 కోట్లు ఇవ్వడంతో పాటు అక్కడి ప్రజలకు 300 ఇళ్లు కట్టిస్తానంటూ లేఖలో రాసుకొచ్చాడు. కేరళ ప్రభుత్వంతో కలిసి పని చేయడం కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన తెలియజేశారు.
మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్ డే నేపథ్యంలో సుఖేష్ చంద్రశేఖర్ ఓ కాంటెస్ట్ పెట్టారు. అందులో పాల్గొన్న వారిలో 100 మందిని ఎంపిక చేసి వారందరికి ఐ ఫోన్ 15 ప్రోలు బహుమతులుగా ఇస్తున్నట్లు చెప్పారు. జాక్వెలిన్‌ని ఎప్పుడూ అదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుతూ… ఐ ఫోన్ విజేతల వివరాల్ని సైతం ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం సుఖేష్ జైలు జీవితం అనుభవిస్తున్నప్పటికీ బాధితులకు భారీ విరాళం, అభిమానులతో పాటు తన ప్రేయసిగా చెబుతున్న జాక్వెలిన్ కు సైతం భారీ బహుమతి ప్రకటిస్తూ ఓ లేఖ విడుదల చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది.