జై భీమ్ చిత్రం అస‌లు క‌థానాయ‌కుడు ఇత‌డే

విధాత‌: లాకప్ డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది.తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డుస్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటుడిగా, నిర్మాత సూర్య ఫెర్ఫార్మెన్స్ ఎలా […]

జై భీమ్ చిత్రం అస‌లు క‌థానాయ‌కుడు ఇత‌డే

విధాత‌: లాకప్ డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది.తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డుస్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటుడిగా, నిర్మాత సూర్య ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అడ్వకేట్ చంద్రు జీవితం తెరపైన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడ వ‌లిసిందే..

తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు లైఫ్ స్టోరీ తెలుసుకుందాం: ఒక న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి మానవ హక్కుల కోసం డబ్బు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి. ఆయన జడ్జ్ అయ్యాక 6 ఏళ్లలో 96000 కు పైగా కేస్ లు పరిష్కరించి రికార్డ్ సృష్టించారు.మహిళలకు దేవాలయంలో పూజారులు కావొచ్చు , కులం ఏదైనా అందరికి ఒకే స్మశానం ఉండాలి ఇలా ఎన్నో విప్లవాత్మక తీర్పులు ఇచ్చారు.కోర్ట్ లో my lord అని పిలవొద్దు అన్నారు , పదవికి ముందు విరమణ తర్వాత తన ఆస్తులను ప్రకటించారు.

జడ్జి దగ్గర ఉండే బంట్రోతులకు రెడ్ కాప్ ఉండటం, ఐరన్ బిళ్ళ ఉండటం అదంతా స్వేచ్చకి విరుద్ధమ‌ని వాటిని తీసేయించారు.తన కార్ మీద ఉండే రెడ్ బుల్బ్ ని తీసేసారు, SI రేంజ్ అధికారి తనకి గార్డ్ ఎందుకు అని ఒక్క constable నే సెక్యురిటి గా తీసుకున్నారు.ఆయన ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డ్ లో ఇలా రాసి ఉండేది..ఇక్కడ ఎవరూ దేవతలు లేరు మీరు పూలు బొకేలు తీసుకురావద్దు… ఇక్కడ ఎవరు ఆకలితో లేరు మీరు పండ్లు స్వీట్లు తీసుకురావద్దు..ఇక్కడ ఎవరు చలికి వనకడం లేదు మీరు శాలువాలు తీసుకురావద్దు అని ఉండేది.