Jayasudha| పాక్ క్రికెటర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న జయసుధ.. వాళ్లు గే అంటూ షాకింగ్ కామెంట్స్
Jayasudha| సహజ నటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కథానాయికగా నటించి మెప్పించిన జయసుధ ఇప్పుడు తల్లి పాత్రలు, అత్త పాత్రల్లో మెరుస్తూ అలరిస్తుంది. మరోవైపు ఇంటర్వ్యూలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది.అయితే జయసు

Jayasudha| సహజ నటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కథానాయికగా నటించి మెప్పించిన జయసుధ ఇప్పుడు తల్లి పాత్రలు, అత్త పాత్రల్లో మెరుస్తూ అలరిస్తుంది. మరోవైపు ఇంటర్వ్యూలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది.అయితే జయసుధ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకోగా, రెండో భర్త కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మరో వ్యక్తితో క్లోజ్‌గా తిరుగుతుంది జయసుధ. అతను జయసుధ జీవితంపై పుస్తకం రాస్తున్నారని, తన లైఫ్‌ని దగ్గరుండి చూడాలనే ఉద్దేశ్యంతోనే ఆమె వెంట వస్తున్నాడని చెప్పింది.
ఇక పెళ్లికి ముందు ఎలాంటి క్రష్ ఉండేదని అడగగా, క్రికెటర్స్ అంటే తనకి బాగా ఇష్టం ఉండేదని, పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం ఏర్పడిందని చెప్పింది. అతడిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందట.కాని అది సాధ్యం కాలేదని పేర్కొంది. ఇక హిందీ హీరోలపై తనకి క్రష్ ఉండేదని, ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అని అనుకునేదట. ఇక సింగర్స్ పై బాగా ఆసక్తి ఉండేదని, ఇమ్రాన్ ఖాన్ మాదిరిగానే వారిని కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె అనుకునేదట. కొన్నాళ్లకి సింగర్స్ గే అని తెలిసి షాక్ అయిందట. తొందరపడి ఉంటే కొంప మునిగేదనీ ఫీల్ అయ్యిందట జయసుధ.
ఇండస్ట్రీలో మగవాళ్ల మధ్య ఎలా నెట్టుకొచ్చారు అన్న ప్రశ్నకి జయసుధ సమాధానం ఇస్తూ.. మనకు అంతటా , చాలా సమస్యలు ఎదురవుతాయి, మనం లూస్‌గా ఉంటే వాళ్లకి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్లము అవుతాం. మనం కరెక్ట్‌గా ఉంటే మన జోలికి ఎవరు రారు. అప్పట్లో మా నాన్న నాతో పాటే ఉండేవాడు. ప్రతీదీ ఆయనే చూసుకునేవారు. చాలా స్ట్రిక్ట్. దాంతో సీరియస్‌గా వర్క్ చేసుకునే వెళ్లిపోయే వాళ్లమని తెలిపింది. తానే కాదు చాలా మంది హీరోయిన్లు అలానే ఉండేవారని, ఇలాంటి ఎఫైర్లకి ఛాన్స్ లేదని, ఒకవేళ ఇద్దరూ ఇష్టపడితే అది వేరు అని జయసుధ చెప్పుకొచ్చింది. బయట అలాంటివి చాలానే నడుస్తున్నా ఇండస్ట్రీ మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటుందని పేర్కొంది.