కొలిక్కి వచ్చిన ‘మా’ వ్యవహారం.. సెప్టెంబర్ 12న ఎన్నికలు..!
విధాత:ఎట్టకేలకు మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో ఈ ఎన్నికల కారణంగా తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్‌లైన్ ద్వారా గురువారం ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 22న ‘మా’ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే […]

విధాత:ఎట్టకేలకు మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో ఈ ఎన్నికల కారణంగా తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్‌లైన్ ద్వారా గురువారం ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 22న ‘మా’ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే అధ్యక్ష పదవికి సిద్ధమంటూ పలువురు ప్రకటించారు. దీంతో మా అసోసియేషన్‌లో వేడి రాజుకుంది. తాజాగా మా కార్యవర్గ పదవీకాలం ముగిసింది. దీంతో కార్యవర్గ సభ్యులు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. ఇదిలా ఉండగా ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాగా.. ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం చేయాలని పలువురు సీనియర్ సభ్యులు చూస్తున్నారు. కాగా.. ఆగస్టు 22న జరగనున్న జనరల్ బాడీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.