Mehreen|పెళ్లి కాకుండానే సంతానం కోసం మెహ్రీన్ చేసిన ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

Mehreen| మెహ్రీన్ పిర్జాదా గురించి టాలీవుడ్ ఆడియన్స్‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసింది. అందులో కొన్ని మంచి విజ‌యాలు తీసుకొచ్చాయి. వాటితో మెహ్రీన్ దూసుకుపోయిం

  • By: sn    cinema    May 01, 2024 6:58 AM IST
Mehreen|పెళ్లి కాకుండానే సంతానం కోసం మెహ్రీన్ చేసిన ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

Mehreen| మెహ్రీన్ పిర్జాదా గురించి టాలీవుడ్ ఆడియన్స్‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసింది. అందులో కొన్ని మంచి విజ‌యాలు తీసుకొచ్చాయి. వాటితో మెహ్రీన్ దూసుకుపోయింది.చివ‌రిగా ఎఫ్‌2, ఎఫ్ 3 వంటి చిత్రాల‌తో మంచి హిట్స్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకు వెళ్లిన మెహ్రీన్ ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అవ‌కాశాలు లేక సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. మెహ్రీన్ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ తర్వాత ఈ విష‌యాన్ని రివీల్ చేసింది.

ఇక త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని అంద‌రు భావిస్తున్న స‌మ‌యంలో వారి బంధానికి బ్రేక్ ప‌డింది. ఇక అప్ప‌టి నుండి మెహ్రీన్ త‌న గ్లామ‌ర్ షోతో కూడా తెగ ర‌చ్చ చేస్తుంది. సినిమాలు అడ‌పాద‌డ‌పా చేస్తూ సంద‌డి చేస్తుంది.అయితే మెహ్రీన్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ ఈ మ‌ధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్ప‌టి వైద్య పద్ధతులు, టెక్నాలజీ ద్వారా ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నారు. 30 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సమస్యలు తలెత్తుతున్న సందర్భంలో అలా జరగకుండా ఆడవారు తమ ఆరోగ్యకరమైన అండాలని దాచుకుని త‌మ‌కు న‌చ్చిన‌ప్పుడు పిల్ల‌ల్ని క‌నేందుకు ఎగ్ ఫ్రీజింగ్‌ని చూస్ చేసుకుంటున్నారు.

ఇటీవల ఈ విధానం గురించి మృణాల్ ఠాకూర్ కూడా తెలియ‌జేసింది. ఇప్పుడు దాన్నే ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది మెహరీన్. గత రెండు నెలల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి అయినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని మెహ్రీన్ తెలియ‌జేసింది. భ‌విష్య‌త్ కోసం ఇది చాలా ముఖ్య‌మని చెప్పిన మెహ్రీన్.. త‌ల్లి కావ‌డం అనేది త‌న క‌ల అంటూ వాపోయింది. పిల్ల‌ల్ని క‌న‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి ఇప్పుడు తాను ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్‌ని ఎంచుకున్న‌ట్టు త‌న పోస్ట్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం మెహ్రీన్ చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.