Mokshagna| మోక్ష‌జ్ఞ న్యూ లుక్ ఫొటో షూట్ వీడియో విడుద‌ల‌..ఏమున్నాడురా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Mokshagna| నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉండ‌గా, ఇంత వ‌ర‌కు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కాక‌పో

  • By: sn    cinema    Jul 24, 2024 2:11 PM IST
Mokshagna| మోక్ష‌జ్ఞ న్యూ లుక్ ఫొటో షూట్ వీడియో విడుద‌ల‌..ఏమున్నాడురా అంటూ నెటిజ‌న్స్  కామెంట్స్

Mokshagna| నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉండ‌గా, ఇంత వ‌ర‌కు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కాక‌పోతే సోష‌ల్ మీడియాలో మాత్రం బాల‌య్య త‌న‌యుడికి సంబంధించిన అనేక వార్త‌లు నెట్టింట వార్త‌లు అవుతున్నాయి.. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని చెప్పుకొచ్చారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద కొంత ట్రోలింగ్ జ‌రిగింది. ఆయ‌న లుక్ చూసి ఇప్ప‌ట్లో రావ‌డం క‌ష్ట‌మే అని అన్నారు. కాని స‌డెన్‌గా మోక్ష‌జ్ఞ త‌న సోష‌ల్ మీడియాలో రెండు స్టైలిష్ ఫోటోలు షేర్ చేశాడు.

ఆ ఫొటోలు చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే మోక్షజ్ఞ కొత్త ఫొటోలు చూసి ఇక త్వ‌ర‌లోనే ఆయ‌న ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం అని అంద‌రు అనుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. దీంతో మోక్షజ్ఞ ఫోటోషూట్ వైరల్ గా మారడంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.. హీరో రెడీ అయిపోయాడు, మరి సినిమా ఎప్పుడు? అంటూ లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియాను హోరత్తిస్తున్నారు. అయితే ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో మోక్ష‌జ్ఞ సినిమా చేయ‌బోతున్నాడు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

మోక్షజ్ఞ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ న‌డుస్తుంది. అంతకుముందు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పేర్లు కూడా వినిపించిన ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్టు క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఏదేమైనా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్​ కోరిక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీతో తీరబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి