Mufasa The Lion King|ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ముఫాసాకి గాత్ర‌దానం చేయ‌బోతున్న స్టార్ హీరో

Mufasa The Lion King| 1994లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘లయన్ కింగ్’ చిత్రం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ సినిమా అప్ప‌ట్లో భారీ విజ‌యం సాధించి మూవీ ల‌వ‌ర్స్‌కి ప‌సందైన వినోదం పంచింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రాబోతుంది. ముఫాసా అసలు లయ

  • By: sn    cinema    Aug 16, 2024 4:55 PM IST
Mufasa The Lion King|ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ముఫాసాకి గాత్ర‌దానం చేయ‌బోతున్న స్టార్ హీరో

Mufasa The Lion King| 1994లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘లయన్ కింగ్’ చిత్రం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ సినిమా అప్ప‌ట్లో భారీ విజ‌యం సాధించి మూవీ ల‌వ‌ర్స్‌కి ప‌సందైన వినోదం పంచింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రాబోతుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఈ సినిమా బారీ జెంకిన్స్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా ఇది సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ముఫాసా అనే సింహానికి షారుక్ డబ్బింగ్ చెప్పగా.. సింబా అనే మరో సింహానికి ఆర్యన్ ఖాన్, ముఫాసా చిన్నతనంలోని పాత్రకు అబ్రామ్ డబ్బింగ్ చెప్పారు. ఈ ముగ్గురి డబ్బింగ్ తోపాటు స్టన్నింగ్ విజువల్స్ తో ఈ ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పాలి

ముఫాసా: ది లయన్ కింగ్ మూవీలో తండ్రీకొడుకుల పాత్రలైన ముఫాసా, సింబాలకు షారుక్, ఆర్యన్ డబ్బింగ్ చెప్పారు. ట్రైలర్ లో వాళ్ల వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌ ముఫాసా చిన్నతనంలోని పాత్రకు షారుక్ చిన్న కొడుకు అబ్రామ్ వాయిస్ అందించడం ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చుతుంది. బ్యారీ జెన్కిన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఓ అనాథగా అడివిలోకి వచ్చే ముఫాసా ఆ తర్వాత అదే అడవికి రాజుగా ఎలా ఎదిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. అయితే తెలుగులోను ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, ఈ భాష‌లో ముసాఫా పాత్ర‌కి మ‌హేష్ బాబు వాయిస్ అందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ముఫాసా పాత్ర‌కి మ‌హేష్ బాబు గాత్ర దానం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్. త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ రానుండ‌గా, మహేష్ బాబు అభిమానులు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.