Naga Chaitanya|నాగ చైతన్య సినిమాల కన్నా కూడా అలానే ఎక్కువ సంపాదిస్తున్నారా..!
Naga Chaitanya| అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. పెద్దగా వివాదాలలోకి దూరడు. కాకపోతే సమంతతో విడాకుల విషయం నాగ చైతన్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమోగేలా చేసింది. ఇక సమంత నుం

Naga Chaitanya| అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. పెద్దగా వివాదాలలోకి దూరడు. కాకపోతే సమంతతో విడాకుల విషయం నాగ చైతన్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమోగేలా చేసింది. ఇక సమంత నుండి విడిపోయాక ఏడాది పాటు సింగిల్‌గా ఉన్న చైతూ ప్రస్తుతం శోభితతో పెళ్లికి రెడీ అయ్యాడు. శోభిత ధూళిపాళతో మీ పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటున్నారా? లేక సింపుల్ వెడ్డింగా అని చైతూని ప్రశ్నించగా, “నాకు పెళ్లంటే నా మనసుకి దగ్గరైన వాళ్లందరూ ఉండాల్సిందే. అది భారీగా చేసుకోవాలని ఏం కాదు. కానీ మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం. అలానే చేసుకుంటా. వెడ్డింగ్ హైదరాబాద్‌లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అనేది త్వరలోనే చెప్తాను.” అంటూ చైతూ చెప్పారు.
అయితే నాగ చైతన్య హిట్స్, ఫ్లాప్స్ తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయన రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు.మూవీ బడ్జెట్‌ను బట్టి తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంటాడు. అయితే నాగ చైతన్య సంపాదన తన సినిమాల కన్నా కూడా ఇతర బిజినెస్‌ల నుండే ఎక్కువగా వస్తుందని ఇన్సైడ్ టాక్. హైదరాబాద్‌లో ప్రారంభించిన తన సొంత రెస్టారెంట్ వ్యాపారం ద్వారా చైతూ కోట్లు లాభాలు పొందుతున్నాడని సమాచారం. హైటెక్ సిటీలోని కావూరి హిల్స్‌లో ‘షోయూ టేస్ట్ ఫుల్ ఏషియన్ డెలివెర్డ్ పేరిట ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు .ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోనే టాప్ 10 పాపులర్ రెస్టారెంట్స్‌లో ఒకటి
హైదరాబాద్ వాసులకు వివిధ దేశాల ఆహారాల రుచిని అందించాలనే ఉద్దేశంతోనే నాగచైతన్య దీన్ని ప్రారంభించాడు.చైతూ జస్ట్ సింగిల్డేలోనే ఈ రెస్టారెంట్ ద్వారా రూ.2-3 లక్షలు సంపాదిస్తాడట.వీకెండ్స్‌లో ఆ ఆదాయం రెట్టింపు అవుతుందని టాక్ కూడా నడుస్తుంది. అంటే ఈ రెస్టారెంట్ ద్వారా నెలకి రూ.60 లక్షల ప్రాఫిట్ అందిపుచ్చుకుంటాడని సమాచారం. ఏడాదిలో చైతూ చేసేది ఒక సినిమా మాత్రమే. మిగతా సమయం అంతా రెస్టారెంట్‌కే కేటాయిస్తాడు. ఇదే కాక నాగ చైతన్య ఇతర బిజినెస్‌లలో కూడా భాగం అయ్యాడు. ప్రస్తుతం అతని జీవితం మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా మారింది.