Janhvi Kapoor | మజిలీ డైరెక్టర్‌తో నాగ చైతన్య మూవీ..! హీరోయిన్గా జాన్వీ కపూర్..?
Janhvi Kapoor | అక్కినేని నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతున్నది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజిలీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ నాగ చైతన, సమంత కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ ‘ఖుషీ’ సినిమా చేశాడు.

Janhvi Kapoor | అక్కినేని నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతున్నది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజిలీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ నాగ చైతన, సమంత కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ ‘ఖుషీ’ సినిమా చేశాడు. భారీ అంచనాలతో వచ్చినా ఈ మూవీ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ చైతుతోనే శివ సినిమా చేయబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని మూత్రీ మూవీస్ నిర్మించబోతున్నది. చైతు కోసం శివ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
ఇక ఈ మూవీ కోసం హీరోయిన్గా జాన్వీ కపూర్‌ని తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తనయుడు నాగార్జునతోనూ నటించింది. తాజాగా చైతు, జాన్వీ కపూర్ కాంబో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైతు ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లేకపోతే ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఈ మూవీపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో బాధపడుతున్నారు. తండేల్తో మరోసారి హిట్ బాట పట్టాలని చూస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక మూవీలో నాగ చైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నది. ఇక జాన్వీ కపూర్ తెలుగులో బిజీగా ఉన్నది. ఇటీవల దేవర మూవీతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ప్రస్తుతం రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్గా ఎంపికైంది. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నది. అలాగే, నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ మూవీతో తర్వాత మరో మూవీ పట్టాలెక్కనున్నది. ఈ సినిమాలోనూ జాన్వీ కపూర్‌ని హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది. తాజా, నాగచైతన్యకు జోడీగా తీసుకోనున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఎంత వరకు నిజమున్నదో తెలియదు కానీ.. ఆఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.