Naga Chaitanya|నాగ చైతన్య- శోభితల పెళ్లి తేదీ ఫిక్స్.. వేదిక ఎక్కడ అంటే..!
Naga Chaitanya| అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ఇటీవల తన ప్రేమ, పెళ్లి వార్తలతో ఎక్కువగా నిలుస్తున్నాడు. సమంత నుండి విడిపోయిన తర్వాత శోభితతో డేటింగ్‌లో ఉన్నాడని తెగ ప్రచారాలు జరిగిన ఏ నాడు స్పందించింది లేదు. కాని ఆగస్ట్ 8న ఈ ఇద్దరు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్

Naga Chaitanya| అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ఇటీవల తన ప్రేమ, పెళ్లి వార్తలతో ఎక్కువగా నిలుస్తున్నాడు. సమంత నుండి విడిపోయిన తర్వాత శోభితతో డేటింగ్‌లో ఉన్నాడని తెగ ప్రచారాలు జరిగిన ఏ నాడు స్పందించింది లేదు. కాని ఆగస్ట్ 8న ఈ ఇద్దరు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకొని పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.ఇటీవల వీరి వివాహంపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో సడెన్ గా ఎంగేజ్ మెంట్ జరిగిందని, అయితే పెళ్లికి మాత్రం కొంచెం సమయం తీసుకుంటామని చెప్పారు. దీంతో చైతన్య, శోభితల వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నాగ చైతన్య మరియు శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ఓ టాక్ నడుస్తుంది.
మరోవైపు హైదరాబాద్ లో లేదా రాజస్థాన్‌లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం. 2024 సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుందని సన్నిహితులు చెబుతున్నారు. ఈలోపు నాగ చైతన్య, శోభితల సినిమాలు కూడా కంప్లీట్ అవుతాయని, పెళ్లికి తగినంత సమయం దొరకనుందని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి వీటిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందా అనేది చూడాలి. ఇక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే మూవీ చేస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ ఎమోషనల్ లవ్ డ్రామా. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 11న తండేల్ మూవీ విడుదల కానుంది.
ఇక నాగ చైతన్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2017లో సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు . మూడేళ్లకు పైగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. సమంతకు దూరమైన నాగ చైతన్య తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్లకు దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారు. నాగ చైతన్య-శోభితలు కలిసి విదేశీ యాత్రలకి కూడా వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు కొన్ని లీక్ కావడంతో అప్పుడే అనుమానాలు బలపడ్డాయి. ఇక ఎట్టకేలకి ఆగస్ట్ 8న వీరి ఎంగేజ్‌మెంట్‌తో అందరికి ఓ క్లారిటీ వచ్చింది.