Keerthy Suresh|చిరంజీవి విష‌యంలో నోరు జారిన కీర్తి సురేష్.. దారుణ‌మైన ట్రోలింగ్

Keerthy Suresh| మ‌హాన‌టి సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న న‌టి కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు స్టార్ హీరోలంద‌రితో జత క‌ట్టి మంచి విజ‌యాలు అందుకోవ‌డ‌మే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తోను మెప్పిస్తుంది. ఇక ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయ

  • By: sn    cinema    Aug 02, 2024 4:24 PM IST
Keerthy Suresh|చిరంజీవి విష‌యంలో నోరు జారిన కీర్తి సురేష్.. దారుణ‌మైన ట్రోలింగ్

Keerthy Suresh| మ‌హాన‌టి సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న న‌టి కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు స్టార్ హీరోలంద‌రితో జత క‌ట్టి మంచి విజ‌యాలు అందుకోవ‌డ‌మే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తోను మెప్పిస్తుంది. ఇక ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసేలా క‌నిపిస్తుంది. కీర్తి సురేష్ సహజంగా వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ తాను చేసిన కామెంట్‌తో లేని పోని విమ‌ర్శ‌లు అందుకుంటుంది.

ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ సౌత్ ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ గురించి మాట్లాడింది. యాంకర్ ధనుష్, నానిలలో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని యాంకర్ అడ‌గ‌గా, అందుకు ధ‌నుష్ అని స‌మాధానం చెప్పింది కీర్తి సురేష్‌. ఇక ధనుష్, అల్లు అర్జున్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగగా అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చింది. అల్లు అర్జున్, మహేష్ బాబు లలో అల్లు అర్జున్ అని తెలిపింది. అల్లు అర్జున్, చిరంజీవి లలో ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం అని అడగగా చిరంజీవి సర్ అని తెలిపింది. చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం అని అడగగా విజయ్ అంటూ కీర్తి సురేష్ సమాధానం ఇవ్వడం అందరికి షాకింగ్ గా ఉంది.

చిరంజీవి కంటే విజయ్ ఎలా మంచి డ్యాన్సర్ అవుతాడో ఆమెకే తెలియాలి. చిరంజీవిని మించి విజ‌య్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడా అంటూ కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అంతేకాదు కీర్తి సురేష్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్” అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని టాక్ న‌డుస్తుంది. మ‌రో వైపు కీర్తి సురేష్ , ఓ కమెడియన్‌ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా అనేక కథనాలు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.