నటి హేమకు నోటీసులు

విధాత:మూవీ ఆర్టిస్ట్‌ ఆసోసియేషన్‌ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్‌ ఎదురైంది. నటి హేమకు 'మా' క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కాగా మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్‌ పావులు కదుపుతున్నారంటూ నటి హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్‌ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు […]

నటి హేమకు నోటీసులు

విధాత:మూవీ ఆర్టిస్ట్‌ ఆసోసియేషన్‌ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్‌ ఎదురైంది. నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కాగా మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్‌ పావులు కదుపుతున్నారంటూ నటి హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్‌ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆడియో టేప్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇక ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు ఉన్నారు.