The Raja Saab Trailer : హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ ‘రాజాసాబ్’

ప్రభాస్ 'రాజాసాబ్' ట్రైలర్ హాలీవుడ్ రేంజ్‌లో.. హర్రర్, కామెడీ సన్నివేశాలతో ఫ్యాన్స్‌కు దసరా పండుగ వాతావరణం.

The Raja Saab Trailer : హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ ‘రాజాసాబ్’

విధాత : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హర్రర్ కామెడి థ్రిల్లర్ మూవీ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింటా భారీ వ్యూస్ తో దూసుకపోతుంది. రాజాసాబ్ లో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ తో కామెడీ పండించే ప్రయత్నం చేయడం కొత్తగా కనిపించింది. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. సినిమాలోని హర్రర్ సన్నివేశాలు..కామెడీ సన్నివేశాలతో కూడిన ట్రైల‌ర్‌ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర చుట్టు దెయ్యం నేపథ్యంలో సాగే సన్నివేశాలు..మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్‌ అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? రాక్షసుడిని అనే డైలాగ్‌ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. సినిమాలోని హర్రర్ సీన్లు.. పోరాటా దృశాలు హాలివుడ్ రేంజ్ లో ఉన్నాయని టాక్. రాజాసాబ్ ట్రైలర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు దసరా పండగ ముందే వచ్చిందని చెప్పాలి.

రాజాసాబ్ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ సలార్, కల్కీలలో రోమాన్స్ తగ్గిందన్న నేపథ్యంలో ఈ సినిమాలు ఏకంగా ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లుగా కనిపించింది. ఈ మూవీకి సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం 2026 జనవరి 9న, సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.