తారాస్థాయిలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు …
విధాత: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు తారా స్థాయిలో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఈ క్రమంలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'భీమ్లా నాయక్' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి, మ్యూజిక్ సెన్షేషన్ థమన్ అందించిన సంగీతం అదిరిపోయింది. […]

విధాత: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు తారా స్థాయిలో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఈ క్రమంలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి, మ్యూజిక్ సెన్షేషన్ థమన్ అందించిన సంగీతం అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా అయితే కోరుకుంటారో దాన్ని మించి థమన్ కంపోజిషన్ ఉండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. తాజాగా రిలీజైన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్, విడుదలైన కొద్ది సేపట్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియం’కి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతుండగా, రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తున్నాడు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.