Rajamouli|ఏంటి రాజమౌళి సినిమానే సూర్య రిజెక్ట్ చేశాడా.. కాకపోతే.!
Rajamouli|ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి సినిమాలంటే జనాలలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతుంటారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్యకి ఓ సారి ఛాన్స్ వచ్చిన కూడా చేయలేదట. ఈ విషయాన్ని కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళినే తెలియజేశాడు. వివరాలలోకి వెళితే కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగిం

Rajamouli|ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి సినిమాలంటే జనాలలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతుంటారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్యకి ఓ సారి ఛాన్స్ వచ్చిన కూడా చేయలేదట. ఈ విషయాన్ని కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళినే తెలియజేశాడు. వివరాలలోకి వెళితే కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళితోపాటు దర్శకుడు బోయపాటి శ్రీను చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. వేడుకకు గెస్ట్‌గా వచ్చిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. సూర్య గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన బాహుబలి సినిమాకి ఇన్స్ప్రేషన్ సూర్యనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి.
తెలుగు సినిమాని ఇక్కడితోనే ఉంచకుండా.. దానిని బయటకు తీసుకెళ్లడానికి..ముఖ్య కారణం సూర్య అంటూ రాజమౌళి చెప్పారు. చాలా సంవత్సరాలు, చాలాసార్లు.. గజినీ సమయంలో సూర్య ఇక్కడికి వచ్చి.. ఇక్కడ ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్స్ సమయంలో సూర్య తెలుగు వారికి ఎలా దగ్గరయ్యాడనేది నాకో కేస్ స్టడీలాగా మారిపోయింది. ఇదే విషయాన్ని నేను ఎందరో హీరోలకు, దర్శకులకు చెప్పేవాడినంటూ తెలిపారు. కేవలం సినిమాను ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల ప్రేమను తాను ఎలా పొందాడో.. మనం కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రజల ప్రేమను అలా పొందాలని చెప్తూ ఉండేవాడిని. సో సూర్య యూ ఆర్ మై ఇన్స్ప్రేషన్ ఫర్ పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి అని చెప్పేశారు.
నిజానికి సూర్యతో పనిచేసే అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నా. సూర్య స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఫిల్మ్ మేకర్‌గా కథల ఎంపికలో అతడు తీసుకునే నిర్ణయాల్ని నేను గౌరవిస్తున్నాను. కంగువ కోసం సూర్య పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. సూర్య కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుందనే నమ్మకముంది” అని రాజమౌళి అన్నాడు.రాజమౌళి మగధీర సినిమాను సూర్య చేయాల్సింది. సూర్య రిజెక్ట్ చేయడంలో ఆ తర్వాత రామ్‌చరణ్‌తో మగధీర సినిమా చేశాడు రాజమౌళి. రాజమౌళి ఆఫర్‌ను తిరస్కరించి తప్పు చేశానని చాలా సార్లు సూర్య చెప్పిన సంగతి తెలిసిందే.