Rajamouli|రాజ‌మౌళి స్టాంప్ వెన‌క అంత క‌హానీ ఉందా.. తీసేద్దామ‌నుకున్నా కూడా..

Rajamouli| రికార్డుల‌ని తిర‌గ‌రాస్తూ టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించ‌బోతున్నాడు రాజ‌మౌళి. పాన్ వ‌రల్డ్ మూవీగా ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ సినిమా కోసం మలయాళం నుంచి పృథ్వీరాజ్‌, తమిళం నుంచి విక్రమ్.. అలాగే కన్నడ, హిందీ భాషల నుంచి, మరోవైపు విదేశీ ఆర్టిస్ట్ లను కూడా తీసుకోబోతున్నారని

  • By: sn    cinema    Aug 07, 2024 8:09 PM IST
Rajamouli|రాజ‌మౌళి స్టాంప్ వెన‌క అంత క‌హానీ ఉందా.. తీసేద్దామ‌నుకున్నా కూడా..

Rajamouli| రికార్డుల‌ని తిర‌గ‌రాస్తూ టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించ‌బోతున్నాడు రాజ‌మౌళి. పాన్ వ‌రల్డ్ మూవీగా ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ సినిమా కోసం మలయాళం నుంచి పృథ్వీరాజ్‌, తమిళం నుంచి విక్రమ్.. అలాగే కన్నడ, హిందీ భాషల నుంచి, మరోవైపు విదేశీ ఆర్టిస్ట్ లను కూడా తీసుకోబోతున్నారని టాక్‌. ఇంటర్నేషన్‌ ఫిల్మ్ గా సుమారు వెయ్యి కోట్లతో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ ప్రారంభమవుతుందని తెలుస్తుంది.

అయితే రాజ‌మౌళి సినిమాల‌ని గ‌మ‌నిస్తే త‌న ప్ర‌తి సినిమాకి ‘An SS Rajamouli Film’ అనే స్టాంప్ వేసుకుంటాడని తెలిసిందే. సినిమా టైటిల్ ప‌డిన త‌ర్వాత టైటిల్ పైన ఇది రాజమౌళి సినిమా అని ఒక స్టాంప్ వస్తుంది. దీనికి సంబంధించి రాజ‌మౌళి ప‌లు విష‌యాలు తెలియ‌జేశాడు . రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ సంస్థ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీయ‌గా, దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో రాజమౌళి తన సినిమాలపై వేసే ‘An SS Rajamouli Film’ స్టాంప్ గురించి మాట్లాడారు. నా ఫస్ట్ సినిమా స్టూడెంట్ నంబర్ 1 రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో చేశాను.అది నా స్టైల్‌కి కాస్త భిన్నం. ఇక రెండో సినిమా నా మూవీ అని చెప్పేలా ఉంటుంది. సింహాద్రి సినిమాకి చివర్లో ‘ఏ ఫిలిం బై రాజమౌళి’ అని పేరు వేసుకుంటే అప్పుడు నిర్మాత వ‌చ్చి ఇది అంద‌రు చేసిన సినిమా నీ ఒక్క పేరు ఎందుకు వేసుకుంటావు అని అడిగారు.

‘సై’ సినిమా నుంచి ‘An SS Rajamouli Film’ అనే స్టాంప్ వేసుకుంటున్నాను. ఇది నా సినిమా అని గుర్తింపు ఉండటానికి ఆ స్టాంప్ వేశాను. కానీ కొన్నేళ్ల తర్వాత అది మరీ ఓవర్ గా అనిపించ‌డంతో తీసేద్దామ‌ని అనుకున్నాను. అయితే స్టాంప్ అప్పటికే ఒక ట్రేడ్ మార్క్ గా మారింది. నేను ఆ స్టాంప్ తీసేద్దాం అనుకున్నాను కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ స్టాంప్ కావాలంటున్నారు అని, ఆ స్టాంప్ వేయకపోతే నీకే ఆ సినిమా నచ్చలేదని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తారు. అందుకే సినిమా బిజినెస్ కోసం స్టాంప్ కొనసాగిస్తున్నాను అని రాజ‌మౌళి చెప్పుకొచ్చారు