BSNL Introduces VoWiFi Service In India | ప్రైవేటు ఆపరేటర్లకు పోటీగా.. బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓవర్ వైఫై
ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ( బీఎస్ఎన్ఎల్) BSNL 'వాయిస్ ఓవర్ వైఫై' సేవను ప్రారంభించింది. సెల్యూలార్ నెట్‌వర్క్ లేని చోట వైఫై ద్వారా అంతరాయం లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.

హైదరాబాద్, విధాత : ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్(BSNL) తన సాంకేతికతను వినియోగించడం మొదలుపెట్టింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ మరో ఆరేడు నెలలో 5జీ ని కూడా ఆరంభించబోతున్న విషయం తెలిసిందే. సెల్యూలార్ నెట్ వర్క్ పనిచేయని చోట అంతరాయం లేకుండా మాట్లాడుకునేందుకు వీలుగా బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓవర్ వైఫై ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రీజియన్లలో వైఫై నెట్ వర్క్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంటి లోపల, ఇరుకైన ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలలో సెల్యులార్ నెట్ వర్క్ పనిచేయదు. ఈ సమయంలో ఇంట్లో వైఫై ఉన్నా, ఫోన్ లో 4జీ ఉన్నా మీరు చేసే కాల్స్ కాని రిసీవ్ చేసుకునే కాల్స్ కాని డిస్ కనెక్ట్ కావు. అయితే 4జీ ఫోన్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీసుకు ప్రైవేటు ఆపరేటర్లు జియో, ఏయిర్ టెల్, వోడాఐడియా మాదిరి ఎలాంటి అదనపు రుసుం విధించారు. బీఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాయిస్ ఓవర్ వైఫై ను సౌత్ అండ్ వెస్ జోన్ సర్కిల్ లో ప్రారంభించారు. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం ఇప్పటికే దేశంలో ఒక లక్ష మొబైల్ టవర్లను ఏర్పాటు చేయగా, మరో 97,500 టవర్లను కూడా ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకున్నది.