Rithu Chowdary| హైప‌ర్ ఆది వ‌ల్లే నేను జ‌బ‌ర్ధ‌స్త్ మానేయాల్సి వ‌చ్చింది.. రీతూ చౌద‌రి షాకింగ్ కామెంట్స్

Rithu Chowdary| ఒకప్పుడు వెండితెర‌పై మాత్ర‌మే గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శన క‌నిపించేది. బుల్లితెర‌పై ఏ మాత్రం క‌నిపించేది కాదు. ప్ర‌తి ఒక్క‌రు చాలా ప‌ద్ద‌తిగా ద‌ర్శ‌న‌మిచ్చేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితి మారింది. బుల్లితెర‌పై తమదైన అందం, అభినయం, ఇతర టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు.ఈ అమ్మడు కొంత కాలంగా టెలివిజ‌న్ రంగంలో సంద‌డి చేస్తూ వ‌రుస అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటుంది. 'గో

  • By: sn    cinema    Jul 27, 2024 12:17 PM IST
Rithu Chowdary| హైప‌ర్ ఆది వ‌ల్లే నేను జ‌బ‌ర్ధ‌స్త్ మానేయాల్సి వ‌చ్చింది.. రీతూ చౌద‌రి షాకింగ్ కామెంట్స్

Rithu Chowdary| ఒకప్పుడు వెండితెర‌పై మాత్ర‌మే గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శన క‌నిపించేది. బుల్లితెర‌పై ఏ మాత్రం క‌నిపించేది కాదు. ప్ర‌తి ఒక్క‌రు చాలా ప‌ద్ద‌తిగా ద‌ర్శ‌న‌మిచ్చేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితి మారింది. బుల్లితెర‌పై తమదైన అందం, అభినయం, ఇతర టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు.ఈ అమ్మడు కొంత కాలంగా టెలివిజ‌న్ రంగంలో సంద‌డి చేస్తూ వ‌రుస అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటుంది. ‘గోరింటాకు’ అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌ మొదలెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత ‘సూర్య వంశం’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొనడంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి..జ‌బ‌ర్ధ‌స్త్ షోలోను కామెడీతో అల‌రించింది. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ అల‌రించింది. గ‌తంలో ఈ అమ్మ‌డు హైప‌ర్ ఆదితో క‌లిసి జ‌బ‌ర్ధ‌స్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల‌లో తెగ సంద‌డి చేసేది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి అంద‌రు ఏవేవో మాట్లాడుకున్నారు కూడా.అయితే ఉన్న‌ట్టుంది హైప‌ర్ ఆది, రీతూ ఇద్ద‌రు కూడా జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్పారు. ఎందుకు అనే దానిపై ఇప్పటి వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రీతూ జబర్దస్త్ మానేసి వేరే షోలు ఎందుకు చేస్తుంద‌నే దానిపై బోల్డ్‌గా స్పందించింది.

నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆది. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనొక్కదానినే అక్కడ ఏం చేయాలి అని నేను కూడా మానేసాను. హైపర్ ఆది వ‌ల్ల‌నే నేను కూడా జ‌బ‌ర్ధ‌స్త్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాను.ఇక టివి షోలు మాత్రమే చేస్తున్నారు.. సినిమా ఆఫర్స్ రావడం లేదా అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీలో నేను జస్ట్ విజె అవుదాం అని వచ్చాను. ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నా. చాలా షోలు చేస్తున్నా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా. అయితే కొంత మంది ఈ అమ్మాయి బోల్డ్‌గా ఉంటుంది కాబ‌ట్టి అలాంటి పాత్ర‌లే ఇస్తామంటున్నారు. అయితే బోల్డ్‌గా న‌టించ‌డానికి నేను రెడీ. కాక‌పోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అని రీతూ చౌదరి ,చెప్పుకొచ్చింది. ఇక త‌న గ్లామ‌ర్ షోపై చేసే విమ‌ర్శ‌ల‌ని తాను ప‌ట్టించుకోను అని కూడా రీతూ తెలియ‌జేసింది.