భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న సమంత
విధాత:టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లికి ముందు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సమంత పెళ్లి అనంతరం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. గ్లామర్ పాత్రలు, కమర్షీయల్ చిత్రాలను కాస్తా తగ్గించి లేడీ ఒరియంటేడ్, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై మొగ్గు చూపుతుంది సమంత. అలాగే డీగ్లామర్ పాత్రలకు సైతం సై అంటూ నటన పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో […]

విధాత:టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లికి ముందు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సమంత పెళ్లి అనంతరం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. గ్లామర్ పాత్రలు, కమర్షీయల్ చిత్రాలను కాస్తా తగ్గించి లేడీ ఒరియంటేడ్, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై మొగ్గు చూపుతుంది సమంత. అలాగే డీగ్లామర్ పాత్రలకు సైతం సై అంటూ నటన పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది.
ఓటీటీలో ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ సిరీస్ అత్యధిక వ్యూస్ రాబట్టి స్మాల్ స్క్రీన్‌పై సూపర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలంక టెర్రరిస్టుగా డీ గ్లామర్ పాత్రలో కనిపించిన పామ్ తన నటనకు వందకు వందశాలం మార్కులు కొట్టేసింది. ప్రారంభం ఆమెపై విమర్శలు చేసిన వారు సైతం ఈ సిరీస్ విడుదల అనంతరం తన నటపై ప్రశంసలు కురిపించారు. ఈ వెబ్ సిరీస్ కారణంగా సమంత పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఒక్కసారిగా ఆమెకు ఆఫర్లు పెరిగాయి. దీంతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేయాలనుకునే చాలామంది సమంతను అప్రోచ్ అవుతున్నారు.
అలా ఆమెకు నెట్ఫ్లీక్స్ ఓ భారీ ఆఫర్ ఇచ్చిందట. ప్రభాస్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్ ఎంతోకాలం నుంచి ప్లాన్ చేస్తోందట. అయితే దీనిని దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయాల్సిందని టాక్. కానీ నెట్‌ఫ్లిక్స్ నటీనటులతో సహా టీమ్ మొత్తాన్ని ఈ సిరీస్‌లో మార్చాలని నిర్ణయించింది. ఇందులో లీడ్ రోల్ శివగామి పాత్ర కోసం నెట్‌ఫ్లిక్స్ సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే సమంత మాత్రం ఈ అవకాశాన్ని సునాయాసంగా తిరస్కరించినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ సామ్ ఈ అవకాశాన్ని వదులుకోవడాకి గల కారణంపై ఎలాంటి స్పష్టత లేదు. మరీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందించే వరకు వేచి చూడాలి.
ReadMore:RRR మూవీ షూటింగ్ అప్ డేట్స్