Samantha|నిఘా పెట్టకుండా తప్పు చేశా.. అందుకే నా జీవితం ఇలా అయిందన్న సమంత
Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొన్ని రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం మయోసైటిస్ బారిన పడడం,సినిమాలకి కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇవ్వడం ఇలా పలు విషయాలతో సమంత నిత్యం వార్తలలో నిలిచింది.

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొన్ని రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం మయోసైటిస్ బారిన పడడం,సినిమాలకి కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇవ్వడం ఇలా పలు విషయాలతో సమంత నిత్యం వార్తలలో నిలిచింది. సమంత తన పర్సనల్ లైఫ్ లో హెల్త్ పరంగా అలాగే తన పెళ్లి పరంగా కూడా పెద్ద పోరాటమే చేస్తుంది. రెండేళ్ల నుండి సమంత పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. వారు విడాకులు తీసుకొని దాదాపు మూడేళ్లు అవుతున్నా కూడా ఆమె విడాకుల విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అసలు వారి విడాకులకి(Divorce) కారణం ఏంటన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సమంత సహా టోటల్ అక్కినేని కుటుంబం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సమంత చాలా రోజుల తర్వాత “సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది. వచ్చే నెలలో ఇది స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తుంది. కాగా ఈ ప్రమోషన్స్ లో సమంత చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ సిరీస్ ని మేకర్స్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సంగతి తెలిసిందే. మరి నిజ జీవితంలో కూడా స్పై లా ఎప్పుడైనా చేశారా అనే ప్రశ్న సమంతకి ఎదురైంది.కాగా దీనికి సామ్ నేనెప్పుడూ అలా స్పై (Spy) చెయ్యలేదు అని కానీ ఒకప్పుడు అలా స్పై చేసి ఉంటే బాగుండేది అంటూ నవ్వుతూనే ఆమె కామెంట్స్ చేసింది.
దీనితో ఈ కామెంట్స్ తన మాజీ భర్త నాగ చైతన్య కోసమే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మాజీ భర్తపై సామ్ పరోక్షంగా కామెంట్స్ చేస్తుంది అంటూ చాలా మంది అనుకుంటున్నారు. . 2010లో తమిళ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన సమంత.. ఆతరువాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆ సినిమాలో తనతో నటించిన నాగ చైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. కాని ఊహించని విధంగా విడాకులు తీసుకుంది.