Samantha| స‌మంత- నాగ చైత‌న్య విడాకుల‌పై స‌రికొత్త ప్ర‌చారం.. అనారోగ్యమే అస‌లు స‌మ‌స్య‌నా?

Samantha| ఒకప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే జంట నాగ చైత‌న్య‌- స‌మంత‌. చూడ‌చ‌క్క‌గా ఉండే ఈ జంట‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోయేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న‌రు. కొన్నాళ్లు చాలా ప్రేమ‌గా ఉండ‌గా, ఆ త‌ర్వాత .. కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట వి

  • By: sn    cinema    May 17, 2024 7:42 PM IST
Samantha| స‌మంత- నాగ చైత‌న్య విడాకుల‌పై స‌రికొత్త ప్ర‌చారం.. అనారోగ్యమే అస‌లు స‌మ‌స్య‌నా?

Samantha| ఒకప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే జంట నాగ చైత‌న్య‌- స‌మంత‌. చూడ‌చ‌క్క‌గా ఉండే ఈ జంట‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోయేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న‌రు. కొన్నాళ్లు చాలా ప్రేమ‌గా ఉండ‌గా, ఆ త‌ర్వాత .. కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఏంట‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న చేశారు. వీరు కలిస్తే బాగుండు అని ఇప్పటికీ కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఎప్పటికైనా వీరు కలుస్తారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

స‌మంత- నాగ చైతన్య విడాకులు అయి దాదాపు మూడేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ వారి విడాకుల‌కి ఇది కార‌ణం, అది కార‌ణం అంటూ నెట్టింట అనేక ప్ర‌చారాలు న‌డుస్తుంటాయి. అయితే తాజాగా స‌మంత‌- చై విడిపోవ‌డానికి ఆమె అనారోగ్య స‌మ‌స్య‌ల‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. స‌మంత స‌మీప బంధువు నాగ చైత‌న్య- స‌మంత విడిపోవ‌డానికి ఈ కార‌ణం చెప్పింద‌ని ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌మంత‌కి చై అంటే చాలా ప్రాణ‌మ‌ట‌. అయితే త‌న‌కి ముందుగానే అనారోగ్య స‌మ‌స్య గురించి తెలియ‌డంతో భ‌ర్త‌తో ఉండి ఇబ్బంది పెట్ట‌డం కంటే దూరంగా ఉంటే మంచిద‌ని భావించి విడాకులు తీసుకుంద‌ట‌.

ఇది చాలా సిల్లీ రీజ‌న్ లా అనిపిస్తున్నా కొంద‌రు మాత్రం ఇదే కార‌ణం అంటూ నెట్టింట తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుండ‌గా, దానికి సంబంధిత చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడు కాస్త కోలుకోవ‌డంతో తిరిగి సినిమాల‌పై దృష్టి పెట్టింది. నాగ చైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆయ‌న న‌టించిన తండేల్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.