తెలుగు నాట పుట్టిన ఈ చిన్ని పాటల మొలక ..షణ్ముఖ ప్రియ

నేడు వెలిగి పోతోంది తన సాటి లేని స్వర విన్యాస నైపుణ్యం తో.. విధాత:సోనీ టీ వీ ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12 సిరీస్ టాప్ సిక్స్ లో ఒకరిగా.ఆగస్టు 15 న జరగ బోయే గ్రాండ్ ఫి నాలే లో ఈ ఆరుగురి లో ఒకరు విజేత గా ఒకరు ప్రకటింప బడబోయే సమయం అసన్న మైంది ఇపుడు.ప్రతి శనివారం,ఆది వారం రాత్రి 9: 30 నుండి 12:30 వరకు సోనీ టీవీ లో వస్తున్న […]

తెలుగు నాట పుట్టిన ఈ చిన్ని పాటల మొలక ..షణ్ముఖ ప్రియ


నేడు వెలిగి పోతోంది తన సాటి లేని స్వర విన్యాస నైపుణ్యం తో..

విధాత:సోనీ టీ వీ ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12 సిరీస్ టాప్ సిక్స్ లో ఒకరిగా.ఆగస్టు 15 న జరగ బోయే గ్రాండ్ ఫి నాలే లో ఈ ఆరుగురి లో ఒకరు విజేత గా ఒకరు ప్రకటింప బడబోయే సమయం అసన్న మైంది ఇపుడు.ప్రతి శనివారం,ఆది వారం రాత్రి 9: 30 నుండి 12:30 వరకు సోనీ టీవీ లో వస్తున్న ఇండియన్ ఐడల్ 12 విజేత ను జడ్జీ ల తీర్పు తో పాటు, ఆడియన్స్ వోటింగ్ ను కూడా లెక్క లోకి తీసుకుని నిర్ణయిస్తారు190 దేశాల్లో ప్రసరింప బడుతున్న ఈ షో లో టాప్ ఆరుగురు లో షణ్ముఖ ప్రియ కూడా ఒకరు కావటం ఆమె అకుంఠిత దీక్షకు,సాధనకు నిలువెత్తు దర్పణం.ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని పద్మశ్రీ కవితా కృష్ణ మూర్తి చేత ప్రశంసించ బడ్డ ఈ గాయని ప్రతిభ ను మెచ్చుకుని ఆశీర్వదించిన వారి లో మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,వాణీ జయ రాం, ఆషా భాంస్లే, ఏ.ఆర్ రెహ్మాన్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ ప్యారే లాల్ ఇలా ఎందరో. ఏ రకం పాట నైనా అవలీల గా పాడే ఈ పాటల కోయిల ను అజూబి , అద్భుతం అని ప్రఖ్యాత బాలీవుడ్ లో సంగీత దర్శకుడు, ఈ సారి తో సహా గతం లో ఇండియన్ ఐడల్ కు ఎన్నో సార్లు జడ్జి గా ఉన్న అను మాలిక్ ప్రశంసించారు. ఆశీర్వదించారు.ఇందరు సంగీత దిగ్గజాల చేత ప్రశంస లు,ఆశీర్వాదాలు పొంది, పొందుతూ దేశ, విదేశాల్లో అందరి అభిమానాన్ని సంపాదించు కున్న ఈ చిరంజీవి సౌభాగ్యవతి షణ్ముఖ ప్రియ రచ్చ గెలిచి ఇంటి వారి ఆశీర్వాదం కోసం చేతులు జోడించి అర్థిస్తోంది.

మన దేశం లో రాష్ట్రే తరులు షణ్ముఖ కు దయ చేసి ఓట్లు వేయండి అని మనని అడుగుతున్నారు.ప్రస్తుతం ఆడియన్స్ పోల్ వల్ల షణ్ముఖ మూడు నుండి ఐదు స్థానాల మధ్య వస్తోంది.మన ఓట్లు పడితే ఆమె స్థానం మెరుగయ్యే, లేదా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది.దీని కోసం మనం ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం మొత్తం చూడ నక్కర లేదు కూడా.షణ్ముఖ ప్రతిభ మనకి తెలుసు కనుక కేవలం గూగుల్ లో ఇండియన్ ఐడల్ ఆన్లైన్ వోటింగ్ కి వెళ్ళి.ఇండియన్ ఐడల్ 12 ఆన్లైన్ వోటింగ్ on sonyliv అని indian idol on line వోటింగ్ ఆన్ first cry. com అని అడిగి అక్కడి నుండి ఓట్లు వేయ వచ్చు.శనివారం, ఆదివారం రాత్రి 9:30 నుండి 12:30 వరకు వోటింగ్ లైన్ లు తెరిచి ఉంటాయి.9:30 కి మీరు వోటింగ్ మొదలు పెడితే 10 కల్లా వోటింగ్ వేయటం పూర్తి చేసి టీవీ కట్టేసి పడుకో వచ్చు. మనం నిద్ర మానుకో వలసిన అవసరమే లేదు.
జీవితాంతం కృషి చేసి ఆ స్థాయి కి చేరిన ఈ పాటల అద్భుతం షణ్ముఖ కోసం ఒక్క అరగంట ఓట్లు వేయటానికి వెచ్చించి ఆమె ప్రతిభను ప్రోత్సహించి ఆమెను ఆశీర్వదించలేమా ఆలోచించండి.మన వాకిట్లో మొలకెత్తిన ఈ పాటల పరిమళం విశ్వవ్యాపితం అయిన ఈ శుభ తరుణం లో సంగీత గగనం లో ఆమె స్థానం సుస్థిర మవటానికి మనదైన విధం గా మనం చేయూత నందించమా..ఒక్క సారి ఆలోచించండి.
ఈ పోస్ట్ షేర్ చేయండి.
షణ్ముఖ ఆంధ్ర దేశం లో అందరికీ తెలుసు కనక బహుశా మన రాష్ట్రం లో ఆంధ్రులు స్పందించ వచ్చు.హిందీ ప్రోగ్రామ్స్ చూడని మనవారికి నేడు షణ్ముఖ కి వోటింగ్ చేయాలి అని తెలియదు. ఆంధ్రేతరులు దయ చేసి షణ్ముఖ కి వోట్ చేయండి అని మనకి చెబుతున్నారు.వారి మాట విని ఆంధ్రులు షణ్ముఖ కు ఓట్లు వేయండి.గెలుపు, ఓటమి దైవ నిర్ణయాలు.కానీ వోట్ వేయటం ద్వారా ఆంధ్రులు కూడా ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహించుతారు, అనే అభిప్రాయం కలిగించండి.
Please vote for Shanmukha Priya on sony liv and firstcry
వోటింగ్ లైనులు శనివారం,ఆదివారం.రాత్రి 9:30 నుండి12:30 వరకు తెరచి ఉంటాయి.

అందరికీ అభివాదములు.