Pawan Kalyan|ప‌వ‌న్ ద‌గ్గ‌ర ప‌ని చేసే వ్య‌క్తి భార్య మంగ‌ళ‌సూత్రం అమ్మి పేకాట ఆడాడా..అప్పుడు ప‌వ‌న్ ఏం చేశాడు..!

Pawan Kalyan| ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు ఒక ప్ర‌భంజ‌నం. ఆయ‌న‌కి అభిమానులు కాకుండా భ‌క్తులు ఉంటారు. అతి త‌క్కువ కాలంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి ప్ర‌త్య‌ర్ధుల‌తో తిట్లు తిట్టించుకుంటున్నాడు. జ‌నం కోసం, స‌మాజం కోసం ఇవ‌న్నీ భ‌

  • By: sn    cinema    May 03, 2024 7:39 AM IST
Pawan Kalyan|ప‌వ‌న్ ద‌గ్గ‌ర ప‌ని చేసే వ్య‌క్తి భార్య మంగ‌ళ‌సూత్రం అమ్మి పేకాట ఆడాడా..అప్పుడు ప‌వ‌న్ ఏం చేశాడు..!

Pawan Kalyan| ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు ఒక ప్ర‌భంజ‌నం. ఆయ‌న‌కి అభిమానులు కాకుండా భ‌క్తులు ఉంటారు. అతి త‌క్కువ కాలంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి ప్ర‌త్య‌ర్ధుల‌తో తిట్లు తిట్టించుకుంటున్నాడు. జ‌నం కోసం, స‌మాజం కోసం ఇవ‌న్నీ భ‌రిస్తాను అంటూ ప‌వ‌న్ ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌స్తావించ‌డం చూశాం. ఇక ఈ సారి పిఠాపురం నుండ పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల‌నే క‌సితో ఉన్నారు. ఆయ‌న‌ని గెలిపించాల‌ని కూడా ప‌లువురు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. మ‌రికొంద‌రు ప‌లు ఇంట‌ర్వ్య‌లలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గొప్ప మ‌న‌సు గురించి తెలియ‌జేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స‌న్నిహితంగా ఉండే శ‌ర‌త్ మ‌రార్ ఓ ఇంట‌ర్వ్యూలో పవ‌న్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

శ‌ర‌త్ మ‌రార్ నిర్మాణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు వంటి చిత్రాలు చేశారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో ఎక్కువ‌గా ట్రావెట్ చేయ‌డంతో ఆయన మ‌న‌స్త‌త్వం ఏంటో శ‌ర‌త మ‌రార్‌కి బాగా తెలుసు. అయితే తాజాగా ప‌వ‌న్ గురించి మాట్లాడిన ఆయ‌న‌.. పవన్ నిర్మాతలని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, తాను నష్టపోతాడు తప్ప.. నిర్మాతలకు నష్టం కలిగించడు అని అన్నాడు. డ‌బ్బు విష‌యంలో ఏ మాత్రం ప్లానింగ్ ఉండ‌క‌పోవ‌డంతో ఓసారి నేను, త్రివిక్ర‌మ్ చిన్న‌పాటి స‌ల‌హ ఇచ్చాం. పిల్ల‌లు ఉన్నారు. కాస్త డ‌బ్బు విష‌యంలో వెన‌క ముందు ఆలోచించ‌మ‌ని చెప్పాము. అప్పుడు మాకు చిన్న‌పాటి క్లాసు పీకి నా పిల్ల‌ల‌కి ఎలాంటి స‌పోర్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. వాళ్లు మంచి లైఫ్ లీడ్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స్ట్రెంత్ ఇస్తాను అని ప‌వ‌న్ అన్నారు.

ఇక ప‌వ‌న్ చాలా మందికి సాయం చేయ‌గా, అందులో కొంద‌రు మిస్ యూజ్ చేశారు. అయితే అలాంటి వారిని ప‌వ‌న్ అంత ఈజీగా వ‌దిలి పెట్ట‌రు. విశ్వ‌రూపం చూపిస్తారు అని శ‌ర‌త్ మ‌రార్ అన్నారు. ఇక ఓ ఇన్సిడెంట్ గురించి చెబుతూ.. ప‌వన్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే ఓ వ్య‌క్తి భార్య మంగళ సూత్రం అమ్మేసి మరీ పేకాట ఆడాడు. అప్పుడు అత‌ని భార్య ప‌వ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న బాధ చెప్ప‌కుంది. ఆ స‌మ‌యంలో ఆమెకి ధైర్యం చెప్పి ఆర్ధికంగా సాయం చేశారు ప‌వ‌న్. ఆ త‌ర్వాత ఆమె భ‌ర్త‌ని పిలిపించి వాడికి భ‌యాన్ని రుచి చూపించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తో అతడు మళ్ళీ పేకాట జోలికి పోలేదు. తన పద్ధతి మార్చుకొని మంచిగా ఉన్నాడు అని శరత్ మరార్ చెప్పుకొచ్చారు.