Shoban babu| శోభ‌న్ బాబు గ‌దికి హీరోయిన్ ప‌దే ప‌దే వ‌స్తుండ‌డంతో ఆయ‌న ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shoban babu| ఆంధ్రుల అందగాడు.. సోగ్గాడు శోభన్ బాబు త‌న న‌ట‌న‌, అందంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు అనగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత శోభన్ బాబు పేరు ఎక్కువ‌గా చెబుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రక

  • By: sn    cinema    Jul 25, 2024 8:15 PM IST
Shoban babu| శోభ‌న్ బాబు గ‌దికి హీరోయిన్ ప‌దే ప‌దే వ‌స్తుండ‌డంతో ఆయ‌న ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shoban babu| ఆంధ్రుల అందగాడు.. సోగ్గాడు శోభన్ బాబు త‌న న‌ట‌న‌, అందంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు అనగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత శోభన్ బాబు పేరు ఎక్కువ‌గా చెబుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌గా సంపాదించుకున్నాడు శోభ‌న్ బాబు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు, నవలా చిత్రాలకు శోభన్ బాబు ట్రెండ్ సెట్టర్. క్రమశిక్షణతో కెరీర్‌ను నడిపిన శోభన్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించి తన 59వ ఏట కెరీర్‌కి స్వ‌స్తి ప‌లికారు.

ఇక 2008 మార్చి 20 ఉదయం 10.50 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే ఆయ‌న త‌న కెరీర్‌లో శారద, జయలలిత , చంద్రకళ, జయప్రద, జయసుధ, శ్రీదేవిలతో ఎక్కువ సినిమాలు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కి సంబంధించిన ఎఫైర్స్ విష‌యంలో అనేక ఊహాగానాలు వ‌చ్చేవి. ఓ సంద‌ర్భంలో ప్రముఖ రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్.. శోభన్ బాబుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్ సమయంలో శోభన్ బాబు చాలా క్లోజ్ అయ్యారని .. తనను ఎప్పుడూ రూమ్‌కి పిలిచి పాట పాడమని చెప్పేవారని జయకుమార్ తెలిపారు.ఇక‌ ఈ చిత్రంలో సీత క్యారెక్టర్‌లో చంద్రకళ నటించారని.. అయితే ఆమె శోభన్ బాబు రూమ్ ప‌క్క‌నే ఉండ‌డంతో శోభ‌న్ బాబు గ‌దికి త‌ర‌చూ వ‌చ్చేద‌ని ఆయ‌న అన్నారు.

అయితే చంద్రకళ తన గదికి వచ్చిపోతుండటం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని భావించిన శోభ‌న్ బాబు చంద్ర‌క‌ళ మొహం మీద విష‌యాన్ని చెప్పారు అని జ‌య‌కుమార్ అన్నారు. శోభ‌న్ బాబు మ‌హిళ‌ల విష‌యంలో చాలా హుందాగా ఉండేవారు. అగ్ర కథానాయిక, దివంగత తమిళనాడు సీఎం జయలలితతో ప్రేమలో పడటం తనకే ఆశ్చర్యం కలిగించిందని జయకుమార్ పేర్కొన్నారు. ఇక జయలలితను.. శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం అందరికి తెల్సిందే. డాక్టర్ బాబు అనే సినిమా ద్వారా వీరి పరిచయం ఏర్పడ‌గా, ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింద‌ని, ఇక పెళ్లి కూడా చేసుకోవాల‌ని వారు భావించార‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి.