Break Up|ఇండస్ట్రీలో మరో బ్రేకప్…ప్రియుడికి స్వస్తి చెప్పిన స్టార్ హీరోయిన్
Break Up| భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఈ మధ్య కొన్ని కామన్‌గా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించుకోవడం, కొన్నాళ్లు సహజీవనం చేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులకి విడాకులు తీసుకోవడం మనం కామన్‌గా చూస్తున్నాం. పది సంవత్సరాలు కూడా సంసారం చేయ

Break Up| భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఈ మధ్య కొన్ని కామన్‌గా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించుకోవడం, కొన్నాళ్లు సహజీవనం చేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులకి విడాకులు తీసుకోవడం మనం కామన్‌గా చూస్తున్నాం. పది సంవత్సరాలు కూడా సంసారం చేయకుండా కొందరు బ్రేకప్ చెప్పుకుంటుంటే, 20 ఏళ్ళు కాపురం చేసిన తరువాత కూడా విడిపోయేవారు కొందరు. మరోవైపు ప్రేమించి.. పెళ్ళిదాకా వచ్చిన తరువాత కూడా బ్రేకప్ చెప్పుకుంటున్న స్టార్స్ పెరిగిపోతున్నారు. ఆ కోవలోనే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చేరబోతుందనే టాక్ నడుస్తుంది.
శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఈ అమ్మడు సాహో అనే చిత్రంలో ప్రభాస్ సరసన నటించి అదరగొట్టింది.ఈ సినిమా అంత ఆదరణ దక్కించుకోకపోవడంతో తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు శ్రద్ధాకి. బాలీవుడ్లో మాత్రం దూసుకుపోతుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ‘స్త్రీ 2’ సినిమాలో నటించగా, ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే శ్రద్ధా కపూర్ సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత కారణాలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినీ పరిశ్రమలో కో-డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ గత కొద్ది రోజులుగా డేటింగ్లో ఉంది.
ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా కూడా అది లీక్ అయింది.వారి రిలేషన్ గురించి బయటకు అనౌన్స్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆధారాలు ఉన్నాయి. శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ 2023లో చాలా క్లోజ్‌గా మెలిగారు. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న సమయంలో వారి రిలేషన్షిప్లో బ్రేక్ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ మోడీని అన్ ఫాలో చేసింది. అలాగే, రాహుల్ మోడీ ప్రొడక్షన్ హౌస్, ఆత్మీయూర్, ముద్దీన్ శ్వందా పేజీలను శ్రద్ధా కపూర్ అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి రిలేషన్ బ్రేకప్ కావడం వల్లనే వారి రిలేషన్ బ్రేకప్ అయిందనేది ఇన్సైడ్ టాక్. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.