Usha Uthup | పాప్‌ సింగర్‌ ఉషా ఉతప్‌ ఇంట విషాదం.. భర్త జానీ చాకో కన్నుమూత..!

Usha Uthup | ప్రముఖ ఇండియన్‌ పాప్‌ సింగ్‌ ఉష ఉతుప్‌ ఇంట విషాదం చోటుచేసుకున్నది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్‌ (78) కన్నుమూవారు. కార్డియక్‌ అరెస్ట్‌ కారణంగా మృతి చెందినట్లు సమాచారం. జానీ చాకో ఉతుప్‌ సోమవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబం తెలిపింది.

Usha Uthup | పాప్‌ సింగర్‌ ఉషా ఉతప్‌ ఇంట విషాదం.. భర్త జానీ చాకో కన్నుమూత..!

ప్రముఖ ఇండియన్‌ పాప్‌ సింగ్‌ ఉషాఉతుప్‌ ఇంట విషాదం చోటుచేసుకున్నది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్‌ (78) కన్నుమూవారు. కార్డియక్‌ అరెస్ట్‌ కారణంగా మృతి చెందినట్లు సమాచారం. జానీ చాకో ఉతుప్‌ సోమవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబం తెలిపింది. జానీ ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారని.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జానీ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. జానీ చాకో ఉతుప్‌.. ఉషారెండోభర్త. వీరిద్దరూ 70వ దశకంలో తొలిసారిగా కలుకున్నారు. ఉషాసంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖ పాప్ గాయని కాగా.. జానీ టీ తోటల పరిశ్రమతో అనుబంధం ఉన్నది. ఉషామొదటి భర్త రాము అయ్యర్. వీరిద్దరి దాంపత్య జీవితం కేవలం ఐదేళ్లు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత విడిపోయారు. తనది, జానీ చాకో ఉతుప్‌ది వేర్వేరు మతాలు అని గాయని ఉషా ఉతుప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, తమ బంధానికి మతం ఎప్పుడూ అడ్డు రాలేదన్నారు. జానీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఉషా ఉతప్‌ బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా 15 భారతీయ భాషలలో పాడింది. ఇంకా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలీ, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ తో సహా అనేక విదేశీ భాషలలో కూడా పాటలు పాడారు. ఆమెకు 2011లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2024లో పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది.