Soumya Rao|ఇన్నాళ్ల‌కి జ‌బ‌ర్ధ‌స్త్‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన సౌమ్యరావు..!

Soumya Rao| బుల్లితెర కామెడీ షో జ‌బర్ధ‌స్త్ ప్రేక్షకుల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోతో చాలా మంది క‌మెడీయ‌న్స్, యాంక‌ర్స్ సెల‌బ్రిటీ హోదా అందుకున్నారు. యాంక‌ర్స్ విష‌యానికి వస్తే అన‌సూయ‌, ర‌ష్మీలు ఈ షోలో చాలా సంద‌డి చేశారు. అయితే అన‌సూ

  • By: sn    cinema    Aug 11, 2024 6:45 AM IST
Soumya Rao|ఇన్నాళ్ల‌కి జ‌బ‌ర్ధ‌స్త్‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన సౌమ్యరావు..!

Soumya Rao| బుల్లితెర కామెడీ షో జ‌బర్ధ‌స్త్ ప్రేక్షకుల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోతో చాలా మంది క‌మెడీయ‌న్స్, యాంక‌ర్స్ సెల‌బ్రిటీ హోదా అందుకున్నారు. యాంక‌ర్స్ విష‌యానికి వస్తే అన‌సూయ‌, ర‌ష్మీలు ఈ షోలో చాలా సంద‌డి చేశారు. అయితే అన‌సూయ‌కి సినిమా ఆఫ‌ర్స్ రావ‌డంతో ఆమె జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకుంది. ఈమె ప్లేసులోకి కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావు వ‌చ్చింది. ఆమె అందానికి అంతా ఫిదా కాగా, ప‌ర్‌ఫార్మెన్స్ కాస్త నిరాశ‌ప‌ర‌చింది. అనసూయ అంత కాకపోయినా.. వచ్చి రానీ తెలుగుతో ఏదో మేనేజ్ చేసింది.

అయితే అప్పుడప్పుడే సెట్ అవుతుంది అనుకునే స‌మ‌యంలో సౌమ్య‌రావు ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు వ‌చ్చి చేరింది.ఏంటి స‌డెన్‌గా సౌమ్య‌రావుని ఎందుకు తీసేసారు అంటూ చ‌ర్చ కూడా మొద‌లైంది. ప‌లు సంద‌ర్భాల‌లో సౌమ్యరావుని కూడా ఈ విష‌యంపై ప్ర‌శ్నించిన స‌రైన స‌మాధానం రాలేదు.. తాజాగా ఓ ఇంటర్వ్యూతో పాల్గొని అందుకు సంబంధించిన ప‌లు విషయాలు వెల్ల‌డించింది. జబర్దస్త్ నుండి సడెన్‌గా కనుమరుగు కావ‌డంతో వాళ్లు తీసేశారా, మీరు వెళ్లిపోయారా అని ప్ర‌శ్నించ‌గా, అందుకు స‌మాధానం ఇచ్చిన సౌమ్య‌రావు.. ‘వన్ ఇయర్ అగ్రిమెంట్ అయిపోయింది. అప్పుడు వారు నాకు కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా అని సౌమ్య రావు పేర్కొంది.

జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఉన్న‌ప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకు వచ్చి, క్యాబ్ వంటి సౌకర్యాలిచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు లేవు. టీమ్ లీడర్స్, జడ్జస్, ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ అంతా బాగా చూసుకున్నారు’ అని పేర్కొంది.అయితే దీని నుండి నేను నేర్చుకున్న గుణ‌పాఠం ఏంటంటే…ఒక కంపెనీపై, ఒకరిపై ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఈ దారి బాగుంద‌ని అందులోనే వెళ్లాల‌ని అనుకోవ‌ద్దు. ఆ దారి ఎప్పుడు ఎలా క్లోజ్ అవుతుందో కూడా మ‌నకు తెలియ‌దు. హోస్ట్‌గా రాణించాలంటే అంద‌రిని ఆక‌ట్టుకునేలా మాట్లాడాలి, టైమింగ్ ఉండాల‌ని సౌమ్య స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ షోలు చేస్తుంది.