పెళ్లికి ముందే ప్రియుడి చేతిలో మోస‌పోయిన సన్నీ లియోన్…తొలిసారి అత‌డి గురించి నోరు విప్పిందిగా..!

  • By: sn    cinema    Apr 07, 2024 7:30 AM IST
పెళ్లికి ముందే ప్రియుడి చేతిలో మోస‌పోయిన సన్నీ లియోన్…తొలిసారి అత‌డి గురించి నోరు విప్పిందిగా..!

శృంగార తార సన్నీ లియోన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హాట్ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హిందీలోకి అడుగుపెట్టి సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత సినిమా అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. త‌క్కువ స‌మ‌యంలోనే బాలీవుడ్ క్రేజీ న‌టిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. ఇప్పుడు స‌న్నీలియోన్ హిందీ సినిమాలే కాక అప్పుడప్పుడు తెలుగు, తమిళ సినిమాల‌లో కూడా నటిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. మరోవైపు తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా గ‌డుపుతుంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అయితే స‌న్నీ లియోన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

స‌న్నీ లియోన్ డేనియ‌ల్ వెబ‌ర్‌ని పెళ్లి చేసుకోక‌ముందు ఓ వ్య‌క్తి చేతిలో మోస‌పోయింద‌ట‌. అత‌ని వ‌ల‌న మ‌ర‌చిపోలేని బాధ‌ని చ‌విచూసిన‌ట్టు తాజా ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేసింది. ఓ వ్య‌క్తిని చాలా ప్రేమించిన స‌న్నీ లియోన్ అత‌డితో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుపుకుంది. కొన్ని రోజుల త‌ర్వాత అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా మార్పులు రావ‌డం జ‌రిగింద‌ట‌. అయితే త‌న‌ని మోసం చేస్తున్నాడ‌ని స‌న్నీలియోన్ బ‌లంగా అనుకుంద‌ట‌. రెండు నెల‌లో పెళ్లి ఉండ‌గా, షాపింగ్ కూడా అంతా అయిపోయింది. కాని అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌ల‌లో రోజురోజుకి చాలా మార్పు క‌నిపిస్తూ వ‌చ్చింది. ఒక రోజు విసిగిపోయి అత‌నిని స్ట్రైట్‌గా అడిగాను. నిజాయతీగా చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడ‌గ‌డంతో అత‌ను ఓపెన్ అయ్యాడు.

నీ మీద నాకు ప్రేమ లేద‌ని అత‌ను చెప్ప‌డంతో హార్ట్ బ్రేక్ అయినంత ప‌ని అయింది. అత‌ని వ‌ల‌న చాలా రోజుల పాటు మాన‌సికంగా కుంగిపోయిన‌ట్టు స‌న్నీలియోన్ తెలియ‌జేసింది. అయితే అత‌డి చేతిలో మోస‌పోయిన కూడా డేనియ‌ల్ వెబ‌ర్ రూపంలో నా జీవితంలోకి మంచి వ్య‌క్తి వ‌చ్చాడు.అత‌ను న‌న్ను ప్రేమించ‌డ‌మే కాకుండా క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు నా వెంటే ఉన్నాడు. మా అమ్మ నాన్న మరణించినప్పుడు నన్ను నాకు తోడుగా నిలబడింది ఇప్పుడున్న నా భర్తే అంటూ అత‌నిని తెగ పొగడ్త‌ల‌తో ముంచెత్తింది స‌న్నీ లియోన్. ఇప్పుడు ప్ర‌స్తుతం స‌న్నీ లియోన్‌కి సంబంధించిన కామెంట్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.