Nagini | నా భార్య నాగినిగా మారిపోతోంది.. నిద్రించ‌లేక‌పోతున్నా.. క‌లెక్ట‌ర్‌కు ఓ భర్త విజ్ఞ‌ప్తి

Nagini | రాత్రి వేళ నా భార్య నాగిని(పాము)( Nagini )గా మారిపోతోంది.. ఆ త‌ర్వాత బుస‌లు కొడుతుంది.. దీంతో నేను స‌రిగా నిద్రించ‌లేక‌పోతున్నాన‌ని( Sleeping ) ఓ భ‌ర్త క‌లెక్ట‌ర్‌( Collector )కు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశాడు. నా భార్య నుంచి నాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్‌కు బాధిత భ‌ర్త( Husband ) మొర‌పెట్టుకున్నాడు.

Nagini | నా భార్య నాగినిగా మారిపోతోంది.. నిద్రించ‌లేక‌పోతున్నా.. క‌లెక్ట‌ర్‌కు ఓ భర్త విజ్ఞ‌ప్తి

Nagini | ల‌క్నో : రాత్రి వేళ నా భార్య నాగిని(పాము)( Nagini )గా మారిపోతోంది.. ఆ త‌ర్వాత బుస‌లు కొడుతుంది.. దీంతో నేను స‌రిగా నిద్రించ‌లేక‌పోతున్నాన‌ని( Sleeping ) ఓ భ‌ర్త క‌లెక్ట‌ర్‌( Collector )కు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశాడు. నా భార్య నుంచి నాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్‌కు బాధిత భ‌ర్త( Husband ) మొర‌పెట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో వెలుగు చూసింది.

సీతాపూర్‌కు చెందిన మెరాజ్, నసిమున్ అనే దంప‌తులిద్ద‌రూ కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు బాగానే ఉన్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి భార్య రాత్రి వేళ నాగినిగా మారిపోతోంది. అనంత‌రం బుస‌లు కొడుతూ.. కుటుంబ స‌భ్యులంద‌రినీ భ‌య‌పెడుతోంది. ఆ శ‌బ్దాల‌కు త‌మ‌కు నిద్ర కూడా రావ‌డం లేద‌ని భ‌ర్త పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో మెరాజ్.. భార్య‌పై ప‌లుమార్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ప‌ట్టించుకోలేదు.

ఇక చేసేదేమీ లేక‌.. అక్టోబ‌ర్ 4వ తేదీన క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. త‌న బాధ‌ను క‌లెక్ట‌ర్ ముందు వెళ్ల‌గ‌క్కాడు. త‌న భార్య న‌సిమున్ మాన‌సికంగా అస్థిరంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్‌కు తెలిపారు. నాగినిగా మారి రాత్రి వేళ భ‌య‌పెడుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అభిషేక్ ఆనంద్‌కు చెప్పారు.

విచారణకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశం

అయితే జిల్లా మేజిస్ట్రేట్ పోలీసులను మెరాజ్ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.