Supritha| ప్రేమ వ్య‌వ‌హారంపై ఓపెన్ అయిన సుప్రిత‌… నా జీవితంలోకి వారు వ‌స్తూ పోతుంటారంటూ కామెంట్

Supritha| సురేఖా వాణి కూతురు సుప్రిత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా చేయ‌క‌పోయిన కూడా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబ‌ర్‌గా ప‌రిచ‌య‌

  • By: sn    cinema    May 09, 2024 6:49 AM IST
Supritha| ప్రేమ వ్య‌వ‌హారంపై ఓపెన్ అయిన సుప్రిత‌… నా జీవితంలోకి వారు వ‌స్తూ పోతుంటారంటూ కామెంట్

Supritha| సురేఖా వాణి కూతురు సుప్రిత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా చేయ‌క‌పోయిన కూడా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబ‌ర్‌గా ప‌రిచ‌య‌మైన ఈ భామ ఆ త‌ర్వాత మ్యూజిక్ ఆల్బ‌మ్స్ వంటివి చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలోను త‌న గ్లామ‌ర్‌తో ర‌చ్చ లేపుతూ విప‌రీతమైన క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక త‌న త‌ల్లి సురేఖా వాణితో కూడా ఈ అమ్మ‌డు చేసే సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ వీడియోలు చేసి వాటిని సోష‌ల్ మీడియాలో వ‌దులుతూ ర‌చ్చ లేపుతుంటారు . వాటి వ‌ల‌న కొన్ని సార్లు సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు. అయితే వాటిని వీరిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కాక‌పోతే కాస్త శృతి మంచిన కామెంట్స్ చేస్తే మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం.

తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ ర‌చ్చ లేపుతున్నాయి. ఆమె త‌న ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు.. అదే లైఫ్ అంటే అంటూ కాస్త ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇందులో సుప్రిత లుక్స్ చాలా గ్లామ‌ర‌స్‌గా ఉన్నాయి. అయితే ఆ పోస్ట్‌కి ఈ అమ్మ‌డు కామెంట్స్ సెక్ష‌న్ క్లోజ్ చేసింది. ఆమె చేసిన కామెంట్ ప్రేమ వ్య‌వ‌హారం గురించే అయి ఉంటుంద‌ని, దాని గురించి ప‌రోక్షంగా మాట్లాడి ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైన ఈ అమ్మ‌డు మాత్రం ఇటీవ‌ల ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ అంద‌రి అటెన్ష‌న్ త‌న‌వైపుకు తిప్పుకుంటుంది.

ఇక సుప్రిత ఇప్పుడు హీరోయిన్‌గా వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌లు కాగా, ఆ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తుంది. ఆ మ‌ధ్య మధ్య రాత్రి షూటింగ్ చేస్తున్న‌ట్టు కూడా తెలియ‌జేసింది. ఇక ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాల‌ని సుప్రిత బాగానే క‌ష్ట‌ప‌డుతుంది. మ‌రోవైపు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. మ‌రి ఈ భామ‌ తల్లి అండదండలతో హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నిస్తుండ‌గా, ఎంత వ‌ర‌కు సక్సెస్ అవుతుందో చూడాలి.