తెలంగాణ ‘మా’ఏర్పడాలి.. సీవీఎల్ నరసింహారావు
విధాత : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా 3 నెలలు టైమ్ ఉంటుండగానే పోటీ మొదలైంది. మొన్నటివరకు ఇద్దరు అనుకున్న వ్యక్తులు కాస్తా, ఆ తర్వాత ముగ్గురయ్యారు. ఇప్పుడు ఏకంగా ఐదుగురు పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ముందుగా ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. మెగా కాంపౌండ్ ఆశీస్సులతో బరిలోకి దిగారు. ఆ వెంటనే మంచు విష్ణు రంగంలోకి దిగారు. తండ్రితో కలిసి పెద్ద మనుషుల్ని […]

విధాత : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా 3 నెలలు టైమ్ ఉంటుండగానే పోటీ మొదలైంది. మొన్నటివరకు ఇద్దరు అనుకున్న వ్యక్తులు కాస్తా, ఆ తర్వాత ముగ్గురయ్యారు. ఇప్పుడు ఏకంగా ఐదుగురు పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
ముందుగా ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. మెగా కాంపౌండ్ ఆశీస్సులతో బరిలోకి దిగారు. ఆ వెంటనే మంచు విష్ణు రంగంలోకి దిగారు. తండ్రితో కలిసి పెద్ద మనుషుల్ని కలిశారు. తను కూడా అధ్యక్ష పదవిలో పోటీ పడుతున్నట్టు ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఆ వెంటనే హేమ, జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవికి పోటీపడబోతున్నట్టు ప్రకటించారు. దాదాపు 300 మంది సభ్యులు తనను అధ్యక్షురాలిగా ఉండంటున్నారంటూ హేమ ప్రకటించగా.. అందరి మద్దతుతో తొలి మహిళా అధ్యక్షురాల్ని అవుతానంటున్నారు జీవిత రాజశేఖర్.
ఈ పోటీకి తాజాగా తెలంగాణ టచ్ ఇచ్చారు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు. తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత ఎన్నో సంస్థలు విడిపోయాయని, మా అసోసియేషన్ ను కూడా విడగొట్టాలని డిమాండ్ చేస్తూ ఈయన బరిలో దిగారు. తెలంగాణ కళాకారులకు న్యాయం జరగాలంటే ”తెలంగాణ మా”ఏర్పడాలని, దానికి మద్దతుగా అంతా తనకు ఓటేయాలని కోరుతున్నారు.